Aadhaar Card: ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు.. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. మీ గ్రామంలోనే..

ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే పట్టణాల్లోని ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీ గ్రామంలోనే ప్రత్యేక క్యాంపులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఇక్కడ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఉచితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Aadhaar Card: ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు.. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. మీ గ్రామంలోనే..
Aadhaar Card

Updated on: Aug 14, 2026 | 7:49 AM

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలతో ఈ స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలో రెండు విడతలుగా దీనిని చేపడుతున్నారు. ఆగస్టు 11 నుంచి 14 వరకు తొలి దశ క్యాంపులు అందుబాటులో ఉంచనుండగా.. రెండో విడత క్యాంపులు ఆగస్ట్ 17 నుంచి 20వ తేదీ వరకు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆధార్ Mandatory Biometric Update (MBU) కోసం ఈ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక క్యాంపులు జరుగుతున్నాయి. ఈ క్యాంపుల్లో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తారు. విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వం కీలక సూచనలు

ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం కోరింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఉచితంగా అప్డేట్ చేయించవచ్చని స్పష్టం చేసింది. మీ ఊరు, పట్టణంలోని స్కూల్స్‌లోనే ఉచితంగా అప్డేట్ చేయించుకునే అవకాశం దీని ద్వారా లభిస్తోంది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో మొత్తం 8 రోజుల పాటు ఈ శిబిరాలు జరగనున్నాయి. విద్యార్థులు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆధార్ తీసుకుని ఉంటారు. కాస్త పెద్దయ్యాక ఫింగర్ ప్రింట్, ఫేస్, ఐరిస్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేయించుకోవడాన్ని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది విద్యార్థులు తమ వివరాలను అప్డేట్ చేయించుకోలేదు. దీని వల్ల కేవైసీ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ప్రభుత్వ పథకాలు, స్కాలర్ షిప్‌లు, పరీక్షల సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఈ వయస్సు పిల్లలు తప్పనిసరి

5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారులు, 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రంలో ఇంకా 16.51 లక్షల మంది విద్యార్థులు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. గతంలో నిర్వహించిన క్యాంపుల ద్వారా 16.46 లక్షల మంది అప్డేట్ చేసుకున్నారు. మిగిలిన విద్యార్థులు కూడా పూర్తి చేసుకునేందుకు వీలుగా ఈ స్పెషల్ క్యాంపులను ప్రతీ నెలలో ఏర్పాటు చేస్తున్నా, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే పట్టణం, నగర ప్రాంతాల్లో ఉండే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ క్యాంపుల ద్వారా మీ గ్రామంలోనే అప్డేట్ చేయించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us