
ప్రముఖ్య ఈవీ కంపెనీ కొమాకీ తాజాగా ఎక్స్-3 పేరుతో కేవలం రూ.52,999 ధరతో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎక్స్-3 ఎస్ఈ, ఎక్స్- వన్, ఎంజీ సిరీస్ వేరియంట్స్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కొమాకీ ఈవీ బై-2 @ 999 అనే ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎక్స్-3 స్కూటర్ భారతదేశంలోని కొమాకీ అధీకృత డీలర్స్ వద్ద అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌లో అందుబాటులో ఉంటుందని కోమాకి పేర్కొంది.
కోమాకి ఎక్స్-3 స్కూటర్ ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఆకట్టుకుంటుంది.ఈ స్కూటర్‌లో డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు డిజిటల్ డాష్ బోర్డ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, పార్కింగ్ రిపేర్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. ఈ స్కూటర్ మూడు వేర్వేరు రంగు ఎంపికల్లో లభిస్తుంది. గార్నెట్ రెడ్, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కోమాకి ఎక్స్-3 స్కూటర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 3 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుతో రావడం వల్ల ఓ సారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
కోమాకి ఎక్స్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా రైడర్ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. ఈ కొత్త ఎక్స్-3 సిరీస్‌ను ప్రారంభించడం అనేది దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని నడిపించడంలో మరో మైలురాయిగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన వేరియంట్స్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నామని వివరించారు. . మహిళా రైడర్ల అవసరాలను తీర్చడానికి ఎక్స్-3 వేరింయట్‌ను ప్రత్యేకంగా రూపొందించామని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి