Royal Enfield Electric Bike: బుల్లెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లాంచింగ్ ఎప్పుడంటే..?

| Edited By: TV9 Telugu

Jul 09, 2024 | 6:50 PM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్ తారాస్థాయికు చేరింది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఎలక్ట్రికల్ వాహనాలతో మన ముందుకు వస్తాయి. ప్రముఖ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఎట్టకేలకు కొత్త డిజైన్ పేటెంట్లో వెల్లడైంది. కొత్త మోటార్ సైకిల్ బ్రాండ్‌కు సంబంధించి ఇతర మోటార్ సైకిళ్ల మాదిరిగానే రెట్రో ఆధునికమైనదిగా ఉంటుందని డిజైన్ పేటెంట్ వెల్లడించింది.

Royal Enfield Electric Bike: బుల్లెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లాంచింగ్ ఎప్పుడంటే..?
Royal Enfield Electric Bike
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్ తారాస్థాయికు చేరింది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఎలక్ట్రికల్ వాహనాలతో మన ముందుకు వస్తాయి. ప్రముఖ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఎట్టకేలకు కొత్త డిజైన్ పేటెంట్లో వెల్లడైంది. కొత్త మోటార్ సైకిల్ బ్రాండ్‌కు సంబంధించి ఇతర మోటార్ సైకిళ్ల మాదిరిగానే రెట్రో ఆధునికమైనదిగా ఉంటుందని డిజైన్ పేటెంట్ వెల్లడించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను అంతర్గతంగా ఎలక్ట్రిక్ 01 అని పిలుస్తారని ఈ బైక్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత దానికి వేరే పేరు పెట్టే అవకాశం. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల మాదిరిగా ముందు భాగంలో రౌండెడ్ హెర్ల్యాంప్‌తో వస్తుంది. న్యూ హిమాలయన్ 450లో కనిపించేలా కనిపించే రౌండెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు టియర్ అప్ ఇంధన ట్యాంక్ ప్లేస్‌లో బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ మోటార్ సైకిల్ వెనుకవైపు మడ్గార్డ్ క్లాసిక్ 350ను తలపిస్తుంది. రౌండెడ్ సిగ్నల్ లైట్స్, ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్‌తో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బ్యాటరీ ప్యాక్ పరిమాణం గురించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోటారు కూడా చాలా శక్తివంతంగా వస్తుందని, ముఖ్యంగా బెల్ట్ డ్రైవ్‌ను ఉపయోగించి పవర్‌ను వెనుక చక్రానికి బదిలీ చేస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు టైర్లు డిస్క్ బ్రేక్లతో వస్తుందని అంచనా వేస్తున్నారు. 

అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్‌లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తుంది. ముఖ్యంగా 1920లలో చివరిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో కనిపించిన గిర్డర్ ఫోర్కులు ఈవీ వెర్షన్‌లో మళ్లీ లాంచ్ చేస్తున్నారు. స్టార్క్ ఫ్యూచర్‌తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గత సంవత్సరం మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ ధ్రువీకరించారు. స్టార్క్ ఫ్యూచర్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కొత్త సరఫరా భాగస్వాములను సైన్ అప్ చేయడం, ఉత్పత్తి మార్గాలను ఏర్పాటు చేయడం పై కూడా పని చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఆధునిక హంగులతో నియో-రెట్రో డిజైన్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..