Amazon Prime: అమెజాన్ కీలక నిర్ణయం.. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటన..!

|

May 23, 2021 | 2:41 PM

Amazon Prime: ప్రముఖ ఆన్‌లైన్‌ డెలివరీ దిగ్గజం అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్‌ సర్వీసును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా,..

Amazon Prime: అమెజాన్ కీలక నిర్ణయం.. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటన..!
Amazon
Follow us on

Amazon Prime: ప్రముఖ ఆన్‌లైన్‌ డెలివరీ దిగ్గజం అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్‌ సర్వీసును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా, సింగపూర్, జపాన్‌లో ఇప్పటికే ప్రైమ్‌ సర్వీసును వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైమ్‌ సర్వీసును తొలగించి వెబ్‌సైట్‌ లేదా మెయిన్‌ యాప్‌తో మాత్రమే డెలివరి చేయనున్నట్లు తెలిపింది. అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ నుంచి రెండు గంటల్లో డెలివరీని 2019లో ప్రారంభించామని, ఇక ఏడాది చివర్లో థర్డ్ పార్టీ పార్టనర్స్, లోకల్ స్టోర్స్ కు వెళ్లాలనుకుంటున్నామని అమెజాన్ గ్రోసరీ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెనీ లాండ్రీ తెలిపారు.

అయితే అమెజాన్.. ప్రైమ్ నౌ సర్వీసును 2014లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఒకే యాప్ తో షాపింగ్, ట్రాకింగ్ ఆర్డర్స్, కస్టమర్స్ ను కాంటాక్ట్ చేయడం అన్నీ సాధ్యపడుతున్నాయి. ఈ సర్వీసుపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ ఆల్ట్రా ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

బిగ్‌ బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.1500 షాపింగ్‌ చేస్తే రూ.1000 క్యాష్‌ బ్యాక్‌.. వివరాలు ఇవే

LIC Plan: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు.. ఎలాగంటే

Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి