Amazon Great Summer Sale: కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఊహకందని ఆఫర్లు.. అమెజాన్‌ గ్రేట్ సమ్మర్‌ సేల్‌ వచ్చేస్తోంది

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వినియోగదారులకు కోసం ఆఫర్ల పండగ ప్రకటించింది. గ్రేట్ సమ్మర్ సేల్‌ పేరుతో ఊహకందని ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్స్‌, గృహోపకరణాలతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను అందించనుంది. మే 4వ తేదీ నుంచి ఈ సేల్...

Amazon Great Summer Sale: కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఊహకందని ఆఫర్లు.. అమెజాన్‌ గ్రేట్ సమ్మర్‌ సేల్‌ వచ్చేస్తోంది
Amazon Summer Sale

Updated on: Apr 30, 2023 | 8:26 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వినియోగదారులకు కోసం ఆఫర్ల పండగ ప్రకటించింది. గ్రేట్ సమ్మర్ సేల్‌ పేరుతో ఊహకందని ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్స్‌, గృహోపకరణాలతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను అందించనుంది. మే 4వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభంకానుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రం 12 గంటలు ముందుగానే సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది.

సేల్ భాగంగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ ఫోన్ డిస్కౌంట్ ధరపై రూ.18,499, వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ రూ.34,999లకే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఇక రెడ్ మీ 12 సీ ఫోన్ రూ.8,999, వన్ ప్లస్ బుల్లెట్స్ జడ్2 రూ.1599లకు లభించనుంది. వీటితో పాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది.

టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషిన్‌ల వంటి వాటిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌లు లభించనున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్‌లో కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను సైతం అందిస్తున్నారు. వీటితో పాటు అదనంగా ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..