Amazon Great Indian Festival 2021: పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొనసాగుతోంది. అమెజాన్ ఆఫర్లలో భాగంగా వివిధ బ్యాంకులు కూడా డిస్కౌంట్ ప్రకటించాయి. ఈ గ్రేట్ ఇండియా ఫెస్టివెల్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. షియెమి, సోని, ఎల్‌జీ, వన్‌ప్లస్, ఇతర బ్రాండ్ స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్ ప్రకటించింది. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.
Mi LED TV 4A PRO 80 cm (32) స్మార్ట్ టీవీపై ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.19,999 ఉండగా, ఆఫర్‌లో రూ.14,999 లభ్యమవుతోంది. ఈ టీవీ 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల LED ప్యానెల్‌ను కలిగి ఉంది. డిటిఎస్ డిస్‌ప్లే పవర్డ్ 10W డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో పాటు వస్తుంది.
ఎల్‌జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21,990 ఉండగా, ఆఫర్‌లో రూ.17,499 తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాలు. ఎల్‌ఈడీ ప్యానెల్, 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంటుంది.
OnePlus TV Y సిరీస్ 43 Y1 ధరను కూడా తగ్గించింది. ప్రస్తుతం రూ .25,999 లభ్యమవుతోంది. ఈ టీవీ 43అంగుళాలు. 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ ప్యానెల్‌తో వస్తుంది.
ఎల్‌జీలో 43 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.37,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4k హెచ్‌డీ అల్ట్రా హెచ్‌డీ, అధిక రిజల్యూషన్ (3840×2160) ప్యానెల్‌ను కలిగి ఉంది.