కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయలనుకుంటున్నారా.. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫైనల్ డేస్’లో ఐ ఫోన్, సామ్సంగ్ గెలాక్సీ, వన్‌ప్లస్ నర్డ్ నుండి iQoo వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లపై మంచి తగ్గింపును అందిస్తోంది. ‘ఫైనల్ డేస్’ నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై దాదాపు 40 శాతం తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ కూడా స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఎక్స్ఛేంజ్, నో కాస్ట్ EMI సౌకర్యం కల్పిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఫైనల్ డేస్ ఆఫర్స్:
అపిల్ ఐ ఫోన్ 11: 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోకి నీరు, ధూళికి నిరోధకతను కలిగి ఉంటుంది. 12MP అల్ట్రా వైడ్, వైడ్ కెమెరాలతో డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్, 4K వీడియో, స్లో-మోతో 12MP ఫ్రంట్ కెమెరాతో పాటు నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, 0fps వరకు 4K వీడియో. మూడో తరం న్యూరల్ ఇంజిన్‌తో ఫేస్ ID, A13 బయోనిక్ చిప్‌తో, ఐ ఫోన్ 11 64GB ఇంటర్నల్ స్టోరేజీతో ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ(ధర: ₹34,240):
5G సిద్ధంగా ఉన్న గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్865 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీని 1TB వరకు విస్తరించకోవచ్చు. ఇది Android 11లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 12MP+ 8MP+12MP రిజల్యూషన్, 32MP ఫ్రంట్ కెమెరా. గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2400 రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఇన్ఫినిటీ-O సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ నర్డ్ సీఐ 5జీ (ధర: ₹22,999):
వన్‌ప్లస్ నర్డ్ సీఐ 5జీ 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.43 అంగుళాల, 90Hz ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ నర్డ్ సీఐకి UFS 2.1లో 8GB RAM,128GB వరకు విస్తరించుకోవచ్చు. ఇది Qualcomm Snapdragon 750G 5G మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను ఆక్టా-కోర్ ప్రాసెసర్, క్రియో 570 CPU మరియు అడ్రినో 619 GPUతో ఉపయోగిస్తుంది. Nord CE 5G 4,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఒప్పో A74 5G (Price: ₹14,990)
ఒప్పో A74 2400×1080 పిక్సెల్‌లతో 6.49 అంగుళాల FHD+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్ఫోన్క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 2GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది LPDDR4X మెమరీష UFS 2.1కి సపోర్ట్ చేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఆప్టిక్స్‌లో, A74 ట్రిపుల్ కెమెరాతో 48MP + 2MP + 2MP లెన్స్‌లు, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది.
రియల్మీ నర్జో 50ఏ (ధర: ₹9,899):
రియల్మీ నర్జో 50ఏ మీడియా టెక్ హెలియో G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 4GB RAM, 128GB ROM నుంచి 256 GB వరకు విస్తరించుకోవచ్చు. Narzo 50a 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగంలో, స్మార్ట్‌ఫోన్ మీకు 8MP సెల్ఫీ కెమెరాతో పాటు 50MP+2MP+2MP లెన్స్‌లను అందజేస్తుంది. ఇది 6,000mAh సెల్‌పై రన్ అవుతుంది. ఇది Android 11 లో నడుస్తోంది.
Iqoo Z5 5G (ధర: 20,990)
ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ బార్ండ్, iqoo Z5 5Gని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్, LPDDR5, UFS 3.1తో విక్రయిస్తోంది. స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో 44W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది. iQoo Z5 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67 అంగుళాల FHD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 64MP ప్రధాన కెమెరా, f/1.79 Aperture with GW3 సెన్సార్, 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్, అలాగే 16MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. Z5G 8GB RAM, 128GB మెమోరి వరకు పెచ్చుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది.
Read Also.. IOC Profits: లాభాల బాటలో ఐఓసీ.. షేర్ హోల్డర్లకు దీపావళి కానుక ప్రకటన.. ఎంత లాభం వచ్చిందంటే..