Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌

|

Jan 14, 2021 | 7:57 PM

Republic Day sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్‌ సంస్థలు రిపబ్లిక్‌డే సేల్‌కు శ్రీకారం చుట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్‌ ....

Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌
Follow us on

Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్‌ సంస్థలు రిపబ్లిక్‌డే సేల్‌కు శ్రీకారం చుట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్‌ ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ను ప్రకటించింది. జనవరి 20 నుంచి 23 వరకూ ఈ సేల్‌ జరుగుతుందని వెల్లడించింది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అలాగే ప్రైమ్‌ సభ్యులకు జనవరి 19 నుంచే ఈ సెల్‌ ప్రారంభం అవుతుందని తెలిపింది. స్మార్ట్‌ ఫోన్లపై గతంలో ఎన్నడు లేనంతగా రాయితీలను ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రైమ్‌ సభ్యులకు 20 నుంచి22వ తేదీల్లో రాత్రి 8 గంటలకు భారీ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

ఇక మరో ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా ‘బిగ్‌సేవింగ్‌ డేస్‌’ పేరుతో ముందుకు వచ్చింది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకూ భారీ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. టీవీలపై 75 శాతం వరకు రాయితీ ప్రకటించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌.

Vehicle Sales Increased: కరోనా సీజన్‌లోనూ పెరిగిన వాహనాల విక్రయాలు.. యూనిట్ల వివరాలు వెల్లడించిన ఫాడా