Amazon: రూ.3.11 లక్షల కోట్ల పెట్టుబడి.. 10 లక్షల ఉద్యోగాలు.. అమెజాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

అమెజాన్ భారత్‌లో 2030 నాటికి రూ.3.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో పది లక్షల కొత్త ఉద్యోగాలు, 80 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 15 మిలియన్ల చిన్న వ్యాపారాలకు AI ప్రయోజనాలను అందించడమే లక్ష్యం. ఇప్పటికే అమెజాన్ దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది.

Amazon: రూ.3.11 లక్షల కోట్ల పెట్టుబడి.. 10 లక్షల ఉద్యోగాలు.. అమెజాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
Amazon Investment In India

Updated on: Dec 12, 2025 | 12:39 PM

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో రూ.1.55 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. 2030 నాటికి మన దేశంలో రూ.3.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన ఆరవ ఎడిషన్ అమెజాన్ స్మ్భవ్ సమ్మిట్‌లో కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది. కంపెనీ ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడి పెట్టిన దాదాపు రూ.40 బిలియన్లకు అదనం.

పెట్టుబడి లక్ష్యాలు

ఈ కొత్త పెట్టుబడి మూడు కీలక వ్యూహాత్మక స్తంభాలపై దృష్టి సారిస్తుందని అమెజాన్ తెలిపింది. AI-ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతి వృద్ధి, ఉద్యోగ సృష్టి.. అంటే అదనంగా 10 లక్షలు ఉద్యోగాలను సృష్టించడం, సంచిత ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు పెంచడం, 15 మిలియన్ల చిన్న వ్యాపారాలకు AI ప్రయోజనాలను అందించడం అన్నమాట. అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశ వృద్ధికి తాము మరింత తోడ్పడాలని అనుకుంటున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు

కీస్టోన్ స్ట్రాటజీ ద్వారా విడుదలైన ఎకనామిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం..అమెజాన్ భారత్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా, ఈ-కామర్స్ ఎగుమతులకు అతిపెద్ద ప్రోత్సాహకరంగా, దేశంలోని అగ్రశ్రేణి ఉద్యోగ సృష్టికర్తలలో నిలిచింది. నివేదిక ప్రకారం.. 2024 నాటికి సుమారు 28 లక్షల మందికి ఉద్యోగాలు లేదా పరోక్షంగా ఉపాధికి మద్దతు ఇచ్చింది. 12 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది. 20 బిలియన్ల సంచిత ఈ-కామర్స్ ఎగుమతులను సాధ్యం చేసింది.

విద్యలో ఏఐ

కేవలం వ్యాపారానికే కాకుండా అమెజాన్ AI విద్యపైనా దృష్టి పెట్టింది. 2030 నాటికి 40 లక్షలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు AIకి సంబంధించిన విద్య, కెరీర్ అవకాశాలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే షాపింగ్ చేసే విధానాన్ని మెరుగుపరచడానికి లెన్స్ AI వంటి కొత్త AI సాంకేతికతలను తీసుకురానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి