విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో ఓలా ఎలక్ట్రిక్ కు తిరుగులేదు. ఈ విషయం మేం చెబుతున్నది కాదు. గత రెండేళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అత్యాధునిక ఫీచర్లు, సూపర్ సాలిడ్ డిజైన్, అల్ట్రా మోడల్ లుక్ లో వినియోగదారులను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆకర్షించాయి. ఇదే క్రమంలో ఓలా తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ప్రణాళిక చేసింది. ఇప్పటి వరకూ స్కూటర్ల తయారీ పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. ఆ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను మన దేశంలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అన్నీ కుదిరితే 2023, ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను మన దేశంలో గ్రాండ్ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొన్ని హింట్స్, అప్ డేట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 15న నిర్వహించనున్న ఈవెంట్ లో రెండు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఒకటి ఎలక్ట్రిక్ బైక్ అని చెబుతున్నారు. మరొకటి ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో కొత్త కలర్ వేరియంట్లు లేదా ఎస్ 1 ప్రో కన్నా చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసే చాన్స్ ఉంది. ఇందుకు ఓలా ఓ హింట్ ఇచ్చింది. గ్రీనెస్ట్ ఈవీ అని క్యాప్షన్ ఇస్తూ ఎస్1 ప్రో మోడల్ ను ఆకుపచ్చ రంగులో తీసుకొస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిపింది. ఇది అటుంచితే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్, రేంజ్, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొత్త వస్తున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ లు మన దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కు మంచి ఊపు తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేంజ్, అనువైన బడ్జెట్, అధిక సామర్థ్యంతో సర్వీస్ నెట్ వర్క్ ను ఓలా ఏర్పాటు చేస్తోంది. కొత్తగా రానున్న ఈ ఓలా ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ సింగిల్ చార్జ్ పై 300 నుంచి 350 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఇది ఈ దూర ప్రయాణాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బైక్ కొనుగోలు చేసిన వారికి సర్వీస్ కూడా పక్కాగా ఉండేందుకు ఓలా ప్లాన్ చేస్తోంది. అందుకోసం వారి సర్వీస్ నెట్ వర్క్ ను బలోపేతం చేస్తోంది. ఇప్పటి వరకూ ఓలా దేశ వ్యాప్తంగా 750 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వినియోగదారులకు వాహనాల రిపేర్లు, మెయింటెనెన్స్ సులభతరం చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 2.50 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక పనితీరు, అత్యాధునిక ఫీచర్లతోపాటు అనువైన బడ్జెట్లో దీనిని తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ బైక్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించిన వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..