Irctc Complaints: రైల్వే ఫిర్యాదుల కోసం ఆల్ ఇన్ వన్ టోల్ ఫ్రీ నెంబర్.. ఇక సమస్యలన్నీ ఫసక్..!

|

Feb 09, 2024 | 9:30 AM

ప్రయాణ ఇబ్బందులను తెలియజేయడానికి ఫిర్యాదు చేద్దామనుకుంటే ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలా మంది ఫిర్యాదులు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే భారతీయ రైల్వే మీ ఫిర్యాదును నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిందని చాలా మందికి తెలియదు. ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఇబ్బందులతో పాటు  ఇతర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మీరు సహాయం పొందవచ్చు లేదా ఫిర్యాదు చేయవచ్చు.

Irctc Complaints: రైల్వే ఫిర్యాదుల కోసం ఆల్ ఇన్ వన్ టోల్ ఫ్రీ నెంబర్.. ఇక సమస్యలన్నీ ఫసక్..!
Irctc
Follow us on

భారతదేశంలో రైల్వేలు అత్యంత చౌకైన ప్రయాణ సాదనంగా ఉన్నాయి. అయితే విస్త్రుత నెట్‌వర్క్ కారణంగా రైలులో ప్రయాణించే సమయంలో ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అసలే ప్రయాణ ఇబ్బందులను తెలియజేయడానికి ఫిర్యాదు చేద్దామనుకుంటే ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలా మంది ఫిర్యాదులు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే భారతీయ రైల్వే మీ ఫిర్యాదును నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిందని చాలా మందికి తెలియదు. ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఇబ్బందులతో పాటు  ఇతర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మీరు సహాయం పొందవచ్చు లేదా ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణ సమయంలో ప్రయాణికుల కోసం అన్ని రకాల ప్రశ్నలు, ఫిర్యాదులు, సహాయం కోసం ఇంటిగ్రేటెడ్ ‘రైల్ మదద్’ హెల్ప్‌లైన్ నంబర్ “139″ను ప్రారంభించింది.

రైల్వే ప్రయాణంలో ఫిర్యాదులు, విచారణ కోసం బహుళ హెల్ప్‌లైన్ నంబర్‌ల అసౌకర్యాన్ని అధిగమించడానికి భారతీయ రైల్వే అన్ని రైల్వే హెల్ప్‌లైన్‌లను ఒకే నంబర్ 139 (రైల్ మదద్ హెల్ప్‌లైన్)లో త్వరిత ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ప్రయాణ సమయంలో విచారణ కోసం ఏకీకృతం చేసిందని అని భారతీయ రైల్వే ఇటీవల పేర్కొంది.  రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు సహాయం కావాలంటే మీరు ఇండియన్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేయవచ్చు. ఈ నంబర్ టోల్ ఫ్రీ అంటే ఎలాంటి చార్జ్ కట్ అవ్వదు. అలాగే మీరు మీ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.

భారతీయ రైల్వేకు సంబంధించిన టోల్-ఫ్రీ నంబర్ 139 అనేక రకాల సేవలను అందిస్తుంది. మీరు ఫోన్ కాల్‌లు చేయడంతో పాటు ఈ నంబర్‌కు సందేశాలు పంపవచ్చు. ఫిర్యాదును నమోదు చేయడమే కాకుండా, భద్రత, వైద్య అత్యవసర పరిస్థితులు, రైలు ప్రమాదాలు, ఏదైనా ఇతర రైలు సంబంధిత ఫిర్యాదులు, సాధారణ ఫిర్యాదులు లేదా విజిలెన్స్ గురించి సమాచారం కోసం మీరు ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అదనంగ మీ ఫిర్యాదు స్థితి గురించిన సమాచారం ఈ నంబర్‌లో అందుబాటులో ఉంటుంది.  వివిధ రైల్వే గ్రీవెన్స్ హెల్ప్‌లైన్‌లను గత సంవత్సరం నిలిపివేసినట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది అలాగే హెల్ప్‌లైన్ నెం. 182 కూడా ఏప్రిల్ 1, 2021 నుండి నిలిపివేశారు. దీన్ని కూడా 139లో విలీనం చేశారు.  ముఖ్యంగా ఈ హెల్ప్‌లైన్ నంబర్ 139 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)ని ఎంచుకోవచ్చు లేదా స్టార్ బటన్‌ను నొక్కడం ద్వారా నేరుగా కాల్-సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కి కనెక్ట్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

139 హెల్ప్‌లైన్ నంబర్ మెనూ ఇలా

  • భద్రత & వైద్య సహాయం కోసమైతే ప్రయాణీకుడు 1 నొక్కాలి. ఇది కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు వెంటనే కనెక్ట్ అవుతుంది.
  • విచారణ కోసం, ప్రయాణికుడు 2 నొక్కాలి. అలాగే సబ్ మెనూలో పీఎన్ఆర్ స్థితి, రైలు రాక/బయలుదేరిన సమాచారం, వసతి, ఛార్జీల విచారణ, టిక్కెట్ బుకింగ్, సిస్టమ్ టిక్కెట్ రద్దు, వేక్ అప్ అలారం సౌకర్యం/గమ్యస్థాన హెచ్చరిక, వీల్‌చైర్ బుకింగ్, భోజనం బుకింగ్ పొందవచ్చు.
  • సాధారణ ఫిర్యాదుల కోసం, ప్రయాణీకులు 4 నొక్కాలి.
  • విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం, ప్రయాణీకులు 5 నొక్కాలి.
  • పార్శిల్ & వస్తువులకు సంబంధించిన ప్రశ్నల కోసం, ప్రయాణీకుడు 6ని నొక్కాలి.
  • ఐఆర్‌సీటీసీ నడిచే రైళ్ల ప్రశ్నల కోసం ప్రయాణీకులు 7 నొక్కాలి. 
  • ఫిర్యాదుల స్థితి కోసం ప్రయాణీకులు 9 నెంబర్‌ను  నొక్కాలి.
  • ఆఖరిగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడటానికి ప్రయాణీకుడు స్టార్ బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..