మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి ప్రస్తుత రోజుల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇది జనాదరణ పొందిన పెట్టుబడి విధానం అయినప్పటికీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి మొత్తాన్ని రక్షించుకోవడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుది. ఎన్నో ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టే వారిని హెచ్చరిస్తూ ఇటీవల ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు కచ్చితంగా నామినేషన్‌ను అప్‌డేట్ చేయాలని హెచ్చరిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లందరూ సెప్టెంబర్ 30, 2003 నాటికి కచ్చితంగా నామినేట్ చేయాలని సెబీ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అలాగే ఎవరైనా నామినేషన్ నుండి వైదొలగలన్నా సెప్టెంబర్ 30 లోపు చేయాలని పేర్కొంటున్నారు.
మ్యూచువల్ ఫండ్ నామినేషన్ అనేది పెట్టుబడిదారుడు మరణిస్తే పెట్టుబడిని స్వీకరించే వ్యక్తిని పెట్టుబడిదారులు నియమించే ప్రక్రియ. నామినీ ఎలాంటి చట్టపరమైన అవాంతరాలు లేకుండా పెట్టుబడిని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. మార్కెట్ పార్టిసిపెంట్ల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాల ఆధారంగా ఫోలియోలను స్తంభింపజేయడానికి సంబంధించి జూన్ 15, 2022 నాటి సెబి సర్క్యులర్‌లోని పేరా 4లో పేర్కొన్న నిబంధన మార్చికి బదులుగా సెప్టెంబర్ 30, 2023 నుంచి అమల్లోకి వస్తుందని నిర్ణయించారు.
సెబీ సర్క్యులర్ ప్రకారం పెట్టుబడిదారులు తప్పనిసరిగా నామినేషన్ వివరాలను అప్‌డేట్ చేయాలి లేదా నామినేషన్ నుండి వైదొలగాలి. ఈ పని చేయకపోతే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు స్తంభింపజేస్తారు. అంటే పెట్టుబడిదారులు ఇకపై పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను రీడీమ్ చేయలేరు.
మ్యూచువల్ ఫండ్ నామినేషన్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఖాతాను తెరిచిన వారు నామినేషన్ ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి, ఆపై రిజిస్ట్రార్, బదిలీ ఏజెంట్ (ఆర్‌టీఏ) లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు సమర్పించి అప్‌డేట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్ ఖాతాను తెరిచిన వారు వారి మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయవచ్చు. అలాగే మీ ఫోలియోలలో నామినీ ఉన్నారో లేదో చూడవచ్చు. వారు దానిని రెండు కారకాల ప్రామాణీకరణ లాగిన్ ద్వారా నవీకరించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి