SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

|

Aug 20, 2021 | 9:21 AM

SBI: ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్‌, చదువుల నిమిత్తం ఇలా ప్రతి దానికి ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఇది లేనిది చాలా పనులు జరగవు. ఆధార్‌ కార్డులేనిది..

SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!
Follow us on

SBI: ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్‌, చదువుల నిమిత్తం ఇలా ప్రతి దానికి ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఇది లేనిది చాలా పనులు జరగవు. ఆధార్‌ కార్డులేనిది ప్రభుత్వ పథకాలతో పాటు, బ్యాంకింగ్‌ లావాదేవీలు అస్సలు జరగవు. ఇక దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ రంగం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా మరోసారి తన కస్టమర్లను హెచ్చరించింది. ఎస్‌బీఐలో ఖాతాలు కలిగిన వారు ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేసుకోవాలని సూచించింది. బ్యాంకు పనులను సజావుగా జరగాలంటే ఆధార్‌, పాన్‌ కార్డులను అనుసంధానం చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాగా, పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు సెప్టెంబర్‌ 30వ తేదీ. మీరు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయకపోతే మీ పాన్‌కార్డు డియాక్టివేట్‌ అవుతుంది. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. ఈ ఆధార్‌ లింక్‌ను జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండగా, దానిని పొడిగించారు. మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోతే సెక్షన్‌ 234 హెచ్‌ కింద వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయాలని సూచిస్తున్నాయి. ఈ రెండింటిని అనుసంధానం చేయడం వల్ల బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుపుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది.

పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం ఎలా..?

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.
☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.
☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.
☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.
☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

 

ఇవీ కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1400 ప్రీమియంతో రూ.35 లక్షల వరకు పొందవచ్చు.. పూర్తి వివరాలు!

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు