Alcohol
మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. రోజు మద్యం తాగనిదే రోజు గడవు. అయితే దేశంలోని ప్రతి మూల మూలన వైన్ ప్రియులు ఉన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మద్యపానాన్ని ఇష్టపడుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వారి సంఖ్య కూడా భిన్నంగా ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా వినియోగిస్తారో సర్వే జరిగింది. దీని ప్రకారం దేశంలో ఎంత మంది మద్యం తాగుతున్నారో తెలుసుకుందాం.
ఈ రాష్ట్రాలు అత్యధికంగా మద్య వినియోగం..
ఈ మద్యంపై క్రిసిల్ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే నివేదికల ప్రకారం.. భారతదేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95 శాతం మంది 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు. 2020 సంవత్సరంలో దేశంలో విక్రయించబడిన మొత్తం మద్యంలో 45 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో రాష్ట్రాలు ఉన్నాయి.
మద్యాన్ని నిషేధించిన రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2019-20 సంవత్సరంలో మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా మొత్తం రూ. 1,75,501.42 కోట్లు ఆర్జించినట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దేశంలో మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సర్వేలో తేలింది.
- అత్యధిక మద్యపానం ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ పేరు మొదటి స్థానంలో ఉంది. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.
- ఈ జాబితాలో రెండవ నంబర్‌లో త్రిపుర పేరు ఉంది. త్రిపురలో దాదాపు 34.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 13.7 శాతం మంది నిత్యం మద్యం సేవిస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ 34.5 శాతం మంది ప్రజలు క్రమం తప్పకుండా మద్యం సేవిస్తున్నారు.
- ఈ జాబితాలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉంది. 3 కోట్ల జనాభా ఉన్న పంజాబ్ రాష్ట్ర జనాభాలో 28.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఇక్కడ నిత్యం మద్యం సేవించే వారి సంఖ్య అందులో 6 శాతం.
- ఐదవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు 28 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.
- ఈ జాబితాలో గోవా ఆరవ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో దాదాపు 26.4 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.
- కేరళలో 19.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో ఈ రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది.
- దాదాపు 10 కోట్ల జనాభాతో పశ్చిమ బెంగాల్ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో 14 శాతం మంది అంటే దాదాపు 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు.
- ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 10 కోట్ల జనాభా, అంటే 14 శాతం అంటే 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తు్న్నారు. సర్వే సంస్థలు క్రిసిల్‌తో పాటు ఆర్థిక పరిశోధనా సంస్థ ICRIER, లా కన్సల్టింగ్ సంస్థ పీఎల్‌ఆర్ ఛాంబర్స్ సర్వే నిర్వహించాయి.
- ఇక తెలంగాణ రాష్ట్రంలో మద్యం అలవాటు ఉన్నవాళ్లు చాలా ఉన్నారు. మద్యం తాగేవారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మంది 15 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్నవారు ఉన్నారు. ఇందులో 7 శాతం మహిళలు ఉన్నట్లు కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. ఇందులో 54 శాతం మంది వారంలో ఒకసారి మద్యం సేవిస్తుంటే, 28 శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతి రోజు తాగుతున్నట్లు తేలింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి