Airtel xstream: లైవ్‌ టీవీతోపాటు ఓటీటీ సేవలు.. రెండు కొత్త ప్లాన్స్‌ను పరిచయం చేసిన ఎయిర్‌టెల్‌

రూ. 699 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకునే 40 ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 1 టీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ. 999 ప్లాన్‌లో 100 ఎంబీబీఎస్‌ వేగాన్ని పొందొచ్చు. ఈ లిమిట్ దాటిన తర్వాత 2 ఎంబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్స్‌లోనూ 350 లైవ్‌ టీవీ ఛానెళ్లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే యాక్సెస్‌ లభిస్తుంది...

Airtel xstream: లైవ్‌ టీవీతోపాటు ఓటీటీ సేవలు.. రెండు కొత్త ప్లాన్స్‌ను పరిచయం చేసిన ఎయిర్‌టెల్‌
Airtel
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 12, 2024 | 4:42 PM

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్‌ ఎయిర్‌ ఫైబర్‌ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులను ఆకర్షించే క్రమంలో సరికొత్త ప్లాన్స్‌ను పరిచయం చేస్తూ వస్తోంది. వేగవంతమైన వైర్‌లెస్‌ 5జీ ఇంటర్నెట్‌ సేవలను అందించడం కోసం ఎయిర్‌టెల్‌ గత ఏడాది ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. నెలకు రూ. 699, రూ. 999తో ఈ రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్‌ పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 699 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకునే 40 ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 1 టీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ. 999 ప్లాన్‌లో 100 ఎంబీబీఎస్‌ వేగాన్ని పొందొచ్చు. ఈ లిమిట్ దాటిన తర్వాత 2 ఎంబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్స్‌లోనూ 350 లైవ్‌ టీవీ ఛానెళ్లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే యాక్సెస్‌ లభిస్తుంది. ఇక ఈ రెండు ప్లాన్స్‌లో ఏది రిఛార్జ్‌ చేసుకున్నా 4కే ఆండ్రాయిడ్‌ సెటప్ బాక్స్‌ వస్తుంది.

దీంతో దాంతో 350 లైవ్‌ టీవీ ఛానెళ్లను పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఇందులో సోనీలివ్‌, ఈరోస్‌నౌ, లయన్స్‌గేట్‌ ప్లే, అల్ట్రా, మనోరమా మ్యాక్స్, హంగామా ప్లేతో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్ ఫైబర్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పనిచేస్తుంది. ఇది వైఫై 6 టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిని 64 డివైజులకు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..