Aeroplane: విమాన ప్రయాణికులకు అలెర్ట్.. ఆ సీట్లకు పెరుగుతున్న డిమాండ్..!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణికులకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులను షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఓ సీటు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఆ సీటు విశేషాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

Aeroplane: విమాన ప్రయాణికులకు అలెర్ట్.. ఆ సీట్లకు పెరుగుతున్న డిమాండ్..!
plane emergency exit gate

Updated on: Jun 15, 2025 | 6:30 PM

అహ్మదాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన తర్వాత జరిగిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అనూహ్యంగా బతికాడు. ముఖ్యంగా అతడు అత్యవసర గేట్ పక్కన సీటులో ఉండడంతో బతికి బయటపడ్డాడని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలపై విమానం కూలిపోయినప్పుడు అత్యవసర నిష్క్రమణకు సమీపంలో ఉన్న 11 ఏ సీటులో కూర్చున్న విశ్వష్‌కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ట్రావెల్ ఏజెన్సీలు, బుకింగ్ ఏజెంట్లli  అత్యవసర నిష్క్రమణల దగ్గర సీట్లు కోరుతూ ప్రయాణికుల నుండి డిమాండ్ పెరుగుతోంది.

అహ్మదాబాద్‌ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా అందరు ప్రయాణికులు మరణించారు. కానీ 11ఏ ప్రయాణీకుడు అద్భుతంగా బయటపడ్డాడు. 11ఏ సీటు ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడడం ‘అద్భుతం’గా అభివర్ణిస్తున్నారు. ప్రజలు సాధారణంగా అత్యవసర నిష్క్రమణల పక్కన సీట్లలో కూర్చోవడం మానేస్తారు. ఎందుకంటే క్యాబిన్ సిబ్బంది ఈ సీట్లలో ఉన్నవారికి టేకాఫ్‌కు ముందు ప్రత్యేక సూచనలు ఇస్తారు. విమానం కూలిపోయినప్పుడు అత్యవసర నిష్క్రమణల పక్కన ఉన్న సీట్లు అదనపు భద్రతను అందించవని విమానయాన నిపుణులు చెబతున్నారు. ప్రజలు ఊహిస్తున్నట్లుగా తగినంత లెగ్‌రూమ్‌ను అందించవచ్చు. కానీ ప్రయాణికుల్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ప్రయాణికులు అత్యవసర ద్వారాల పక్కన సీట్లు అడుగుతున్నారని ట్రావెల్ ఏజెంట్లు సూచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  

విశ్వష్‌కుమార్ బతికి బయటపడ్డ తర్వాత ప్రయాణీకులు అత్యవసర నిష్క్రమణల పక్కన సీట్ల కోసం అదనపు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నారు. విమానంలో ఎగ్జిట్ సీట్ల సంఖ్య క్యారియర్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బోయింగ్ 787, 777, ఎయిర్‌బస్ A350 లలో ఓవర్‌వింగ్ డోర్ ఎగ్జిట్‌లతో సహా మల్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉన్నాయి. సగటున అవి కాన్ఫిగరేషన్‌ను బట్టి ఎగ్జిట్ వరుసలలో 12 నుంచి 24 సీట్లు కలిగి ఉంటాయి. బోయింగ్ 787 కాన్ఫిగరేషన్లలో ముఖ్యంగా డ్రీమ్‌లైనర్ సిరీస్‌లో సీట్ 11ఏ తరచుగా “మిస్సింగ్ విండో” సీటుగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి