AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola – Uber Merger: ఓలా, ఉబెర్ ఒక్కటవుతాయా? విలీనంపై మళ్లీ మొదలైన చర్చలు..!

Ola - Uber Merger: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబెర్ త్వరలో ఒక్కటి కానున్నాయా? రెండింటి మెర్జింగ్‌కు అన్నీ సెట్ అయ్యాయా?..

Ola - Uber Merger: ఓలా, ఉబెర్ ఒక్కటవుతాయా? విలీనంపై మళ్లీ మొదలైన చర్చలు..!
Ola Taxi
Shiva Prajapati
|

Updated on: Jul 31, 2022 | 5:21 PM

Share

Ola – Uber Merger: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబెర్ త్వరలో ఒక్కటి కానున్నాయా? రెండింటి మెర్జింగ్‌కు అన్నీ సెట్ అయ్యాయా? అంటే అవుననే చెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. విలీనానికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఓలా సహ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ఇటీవల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబెర్ ఉన్నతస్థాయి అధికారులను కలిశారు. ఈ రెండు కంపెనీలు మెర్జింగ్ విషయమై గతంలో కూడా చర్చలు జరిపాయి. అయితే, ఆ సమయంలో రెండు కంపెనీల మధ్య డీల్ కుదరలేదు. తాజాగా ఈ చర్చలు మళ్లీ మొదలవడం ఆసక్తి రేపుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. Ola – Uber మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రెండు కంపెనీలు వృద్ధిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు క్యాబ్ సర్వీస్ కంపెనీలకు భారత మార్కెట్‌లో ఒకదానికొకటి గట్టి పోటీ ఉంది. డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించడానికి, ప్రయాణీకులకు ఆఫర్లు అందించడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా దేశంలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు డిమాండ్ పడిపోయింది. దాంతో ఇటీవలి కాలంలో ఈ రెండు సంస్థలు వృద్ధిలో బాగా వెనుకబడిపోతున్నాయి. ఈ రెండు కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకున్నాయి.

ఉద్యోగులను తొలగించిన ఓలా.. Ola డెలివరీ, యూజుడ్ కార్స్ బిజినెస్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, కంపెనీ ఇప్పుడు ఓ చిన్న బృందంతో కోర్ మొబిలిటీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఓలా చాలా మంది ఉద్యోగులను కూడా తొలగించింది. అధికారిక సమాచారం ప్రకారం 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తున్నా.. అనధికారికంగా మాత్రం 1000 మంది వరకు ఉద్యోగులను తీసేసినట్లు తెలుస్తోంది.

ఉబెర్‌ను విక్రయించనున్నారా? నెల రోజుల క్రితం ఉబెర్ విక్రయానికి సంబంధించి వార్తలు గుప్పుమన్నాయి. భారత్‌లోని యూనిట్‌ను విక్రయించాలని ఉబెర్ భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఉబెర్ రియాక్ట్ అయ్యింది. ఆ వార్తలన్నింటినీ ఖండించింది. అలాంటి నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని స్పష్టం చేసింది ఉబెర్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..