
ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను స్కూటర్లలో మిక్స్ చేస్తూ వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను తీసుకొస్తుండటంతో వీటిని మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే అత్యంత చవకైన సరికొత్త ఓలా స్కూటర్ ను ఇటీవల లాంచ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. దానికి ఆయన ఒక్కరే స్కూటర్ పై దిగిన ఫొటో కాగా, మరొకటి తన బృందం కలిసి దిగిన ఫొటో కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఓలా కొత్త స్కూటర్ ఎస్1ఎక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
The first S1X off the line!! I think I like this design the most amongst all our S1 products! pic.twitter.com/Oo153BStiV
ఇవి కూడా చదవండి— Bhavish Aggarwal (@bhash) September 5, 2023
ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న ఈ కొత్త చవకైన స్కూటర్ ఓలా ఎస్1ఎక్స్ మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 79,999కాగా ప్రస్తుతం దీన ధర రూ. 89,999గా ఉంది. 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఎస్1ఎక్స్ వస్తున్న వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 89,999కాగా, ఇప్పుడు రూ.99,999గా ఉంది. అది విధంగా ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ ధర ప్రారంభంలో రూ.99,999కాగా, ఇప్పుడు దాని ధర రూ. 1,09,999గా ఉంది.
ఈ ఓలా ఎస్1ఎక్స్ డిజైన్ పాత ఓలా స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. ఓలా ఎస్1 లైన్ అప్ లో వస్తున్న అత్యంత చవకైన ఈ మోడల్లో ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, పెద్ద హెడ్ లైట్ కౌల్, సింగిల్ పీస్ సీట్, వంతు తిరిగిన బాడీ ఉంటుంది. అలాగే పాత మోడల్ లాగే ముందు ట్విన్ ఫోర్క్ సస్పెన్షన్ ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జర్బర్ ఉంటుంది. స్టీల్ చక్రాలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..