Tata EV Offers: పండుగ ఆఫర్లు అదరహో.. ఈ టాటా కార్లపై మునుపెన్నడూ లేని తగ్గింపులు..

|

Oct 13, 2024 | 4:04 PM

టాటా కంపెనీ నుంచి విడుదలైన పంచ్, టియాగో ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ లో డిమాండ్ ఉంది. ఖాతాదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీటి ధరలను వరుసగా రూ.1.2 లక్షలు, రూ.40 వేల వరకూ తగ్గించారు. అయితే అక్టోబర్ లో అదనపు తగ్గింపు అందజేయనున్నారు. ఈ నెలలో కొనుగోలు చేసిన వారికి ఈ అదనపు ప్రయోజనాలు వర్తిస్తాయి.

Tata EV Offers: పండుగ ఆఫర్లు అదరహో.. ఈ టాటా కార్లపై మునుపెన్నడూ లేని తగ్గింపులు..
Tata Punch
Follow us on

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో వివిధ రకాల కంపెనీలు పోటీపడుతున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జోరందుకున్న నేపథ్యంలో తమ స్థానాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వివిధ మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ల విషయంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను అమలు చేస్తున్నాయి. మన దేశంలో టాటా కంపెనీ కార్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ వీటి కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా ఈ కంపెనీ అడుగుపెట్టింది. ఆ మార్కెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తన ఖాతాదారులకు టాటా కంపెనీ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన మోడళ్లపై అదనపు తగ్గింపును ప్రకటించింది.

అదనపు తగ్గింపులు..

టాటా కంపెనీ నుంచి విడుదలైన పంచ్, టియాగో ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ లో డిమాండ్ ఉంది. ఖాతాదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీటి ధరలను వరుసగా రూ.1.2 లక్షలు, రూ.40 వేల వరకూ తగ్గించారు. అయితే అక్టోబర్ లో అదనపు తగ్గింపు అందజేయనున్నారు. ఈ నెలలో కొనుగోలు చేసిన వారికి ఈ అదనపు ప్రయోజనాలు వర్తిస్తాయి. గ్రీన్ బోనస్ అని పిలిచే ప్రత్యక్ష నగదు తగ్గింపుతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ లను పొందే అవకాశం లభిస్తుంది. దసరా సందర్బంగా కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం. టాటా పంచ్ ఈవీపై రూ. 26 వేలు, మిడ్ స్పెక్ టీయాగో ఈవీ వేరియంట్ పై రూ.56 వేలు ఆదా చేసుకోవచ్చు.

టాటా పంచ్ ఈవీ..

టాాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకువారు దాదాపు రూ.26 వేలు ఆదా చేసుకోవచ్చు. దీనిలో రూ.20 వేలు నగదు తగ్గింపు ఉంటుంది. మరో రూ.6 వేలను కార్పొరేట్ తగ్గింపు రూపంలో పొందవచ్చు. ఈ ఆఫర్ ఎంవై 2023, ఎంవై 2024 మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. టాటా కంపెనీ గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించింది. రూ.10.99 లక్షలు – 14.99 లక్షల నుంచి 9.99 లక్షలు – రూ.13.79 లక్షలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ధరకు ప్రస్తుత ఆఫర్లు అదనంగా అందిస్తోంది. టాటా పంచ్ ఈవీ 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 365 కిలోమీటర్లు, 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 265 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది.

టాటా టియాగో ఈవీ..

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ధరను గత నెలలోనే తగ్గించారు. దీంతో ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి 10.99 లక్షల ధరకు అందుబాటులోకి వచ్చింది. టాప్ స్పెక్ వేరియంట్ కు దాదాపు రూ.40 వేల వరకూ తగ్గించారు. ఇప్పుడు అక్టోబర్ లో మరింత ఆదా చేసుకునే అవకాశం కలిగింది. మిడ్ స్పెక్ ఎక్స్ టీ వేరియంట్ పై రూ.50 వేల వరకూ నగదు తగ్గింపు ప్రకటించారు. మరో రూ.6 వేలు కార్పొరేట్ తగ్గింపులు కూడా వర్తిస్తాయి. అంటే ఈ కారుపై దాదాపు రూ.56 వేలు వరకూ అదనపు తగ్గింపులు పొందే అవకాశం ఉంది. 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు దాదాపు 275 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 221 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ప్రారంభ స్థాయి టియాగో ఈవీ ఎక్స్ ఈ, ఎక్స్ టీ కార్లపై రూ.పది వేల నగదు తగ్గింపు ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..