Adani Wilmar: వినియోగదారులకు శుభవార్త చెప్పిన అదానీ విల్‌మార్‌.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటన..

|

Jun 19, 2022 | 7:38 AM

వంటనూనెలల ధరలు కాస్త తగ్గుముకం పట్టాయి. పలు కంపెనీలు ఎడిబుల్‌ ఆయిల్‌పై రేట్లు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఎఫ్‌ఎంసిజి రంగ కంపెనీ అదానీ విల్‌మార్ వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

Adani Wilmar: వినియోగదారులకు శుభవార్త చెప్పిన అదానీ విల్‌మార్‌.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటన..
Rice Brand Oil
Follow us on

వంటనూనెలల ధరలు కాస్త తగ్గుముకం పట్టాయి. పలు కంపెనీలు ఎడిబుల్‌ ఆయిల్‌పై రేట్లు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఎఫ్‌ఎంసిజి రంగ కంపెనీ అదానీ విల్‌మార్ వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వివిధ ఉత్పత్తుల ధరలను రూ.10 వరకు తగ్గించినట్లు అదానీ విల్మార్ పేర్కొంది. కొత్త ధరలతో ఈ స్టాక్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాక్ ధరను లీటర్ రూ.220 నుంచి రూ.210కి తగ్గించినట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఫార్చ్యూన్ సోయాబీన్, ఫార్చ్యూన్ కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్ లీటర్ ప్యాక్ ధర రూ.205 నుంచి రూ.195కి తగ్గించింది.

“మేము మా వినియోగదారులకు ఖర్చు తగ్గింపు ప్రయోజనాలను అందజేస్తున్నాము. దీంతో పాటు ధరల పతనం డిమాండ్‌ను పెంచేందుకు దోహదపడుతుందని అదానీ విల్మార్, MD & CEO అంగ్షు మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. విదేశీ మార్కెట్లలో ధరలు పెరగడంతో భారత్‌లోనూ ధరలు పెరిగాయి. భారతదేశం తన ఆహార చమురు అవసరాలలో దాదాపు సగం విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. ఈ కారణంగానే భారత్‌లోనూ విదేశీ మార్కెట్లు వేగంగా పెరిగాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా, కంపెనీల ఖర్చు తగ్గింది మరియు దాని ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరవేస్తున్నాయి.