అదానీ, ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం! ఏపీలో తయారీ యూనిట్‌కే ప్రయత్నం..!

అదానీ గ్రూప్, బ్రెజిలియన్ ఏరోనాటిక్స్ దిగ్గజం ఎంబ్రేయర్ దేశంలో విమానాల తయారీకి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా చొరవను బలోపేతం చేసి, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. సాంకేతిక బదిలీతో భారత్‌ను ప్రాంతీయ విమాన తయారీ కేంద్రం గా మారుస్తుంది.

అదానీ, ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం! ఏపీలో తయారీ యూనిట్‌కే ప్రయత్నం..!
Adani Embraer Partnership

Updated on: Jan 27, 2026 | 11:12 PM

బోయింగ్, ఎయిర్‌బస్‌లతో పోటీ పడేందుకు, భారత్‌లో విమానాలను తయారు చేయడానికి అదానీ గ్రూప్, బ్రెజిలియన్ కంపెనీ కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇది దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా వేలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. ఈ విమానాలను తయారు చేయడానికి అదానీ గ్రూప్ ఏ బ్రెజిలియన్ కంపెనీతో భాగస్వామ్యం కుదిరింది.

అదానీ గ్రూప్, బ్రెజిలియన్ ఏరోనాటిక్స్ మేజర్ ఎంబ్రేర్ మంగళవారం వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించాయి. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో ఒకటి. ఈ భాగస్వామ్యం చిన్న, మధ్య తరహా నగరాలకు ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంగళవారం దేశ రాజధానిలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ఈ సహకారం కేవలం ప్రాంతీయ విమానాలను అసెంబుల్ చేయడానికి మాత్రమే పరిమితం కాదని అన్నారు.

ప్రగతిశీల సాంకేతిక బదిలీ, నైపుణ్య అభివృద్ధి, బలమైన సప్లయ్‌ చైన, భారతదేశాన్ని ప్రాంతీయ విమానాలకు నమ్మకమైన తయారీ కేంద్రంగా మార్చడం కూడా ఇందులో ఉన్నాయి. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ.. ఎంబ్రేర్ సహకారంతో భారతదేశంలో ప్రాంతీయ విమానాల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంబ్రేర్ 150 సీట్ల వరకు వాణిజ్య జెట్‌లను తయారు చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో భారత విమానయాన రంగంలో ఇప్పటికే బలమైన ఉనికిని కలిగి ఉన్న అదానీ గ్రూప్, భారతదేశంలో విమానాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో ప్రాంతీయ రవాణా విమానాల కోసం రెండు కంపెనీలు తుది అసెంబ్లీ లైన్ (FAL)ను కూడా ఏర్పాటు చేస్తాయి.

ఏపీలో యూనిట్‌..?

అయితే ఈ సంస్థ తమ తయారీ యూనిట్‌లను ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్ లలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భోగాపురంలో ఎంబ్రాయర్ ఫ్యాక్టరీ పెట్టాలని ఏపీ ప్రయత్నం చేస్తోంది. భూమి, మౌలికసదుపాయాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంబ్రాయర్ కి ఆఫర్ ఇచ్చింది. భోగాపురంలో ఎంఆర్ ఓ, ఏరోస్పేస్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి