Aadhaar Update: మీరు ఆధార్‌కార్డ్‌ తీసుకుని 10 ఏళ్లు దాటిందా..? అయితే ఈ పని తప్పకుండా చేయాల్సిందే

|

May 15, 2023 | 7:22 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్‌ ఎంతో ముఖ్యమైనది. ఇది లేనిది ఏ పని జరగదు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఎంతో కీలకమైనది. అయితే ఆధార్‌పై కొన్ని నిబంధనలు మార్చింది ప్రభుత్వం. అయితే, ఆధార్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో..

Aadhaar Update: మీరు ఆధార్‌కార్డ్‌ తీసుకుని 10 ఏళ్లు దాటిందా..? అయితే ఈ పని తప్పకుండా చేయాల్సిందే
Aadhaar Card
Follow us on

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్‌ ఎంతో ముఖ్యమైనది. ఇది లేనిది ఏ పని జరగదు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఎంతో కీలకమైనది. అయితే ఆధార్‌పై కొన్ని నిబంధనలు మార్చింది ప్రభుత్వం. అయితే, ఆధార్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీనిపై యూఐడీఏఐకి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కార్డు సవరణతో పాటు అప్‌డేట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. 2014 కంటే ముందు ఆధార్‌ పొందిన వారు తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్డును అప్‌డేట్‌ చేసుకునేందుకు జూన్‌ 14 వరకు గడువు ఇచ్చింది.

దీంతో ఆధార్‌ సెంటర్లు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన డాక్యుమెంట్లతో వినియోగదారులు క్యూలు కడుతున్నారు. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్‌డేట్స్‌ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్‌ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(యూఐడీఏఐ) సూచిస్తుంది. సుదీర్ఘకాలం అనంతరం మార్పులకు యూఐడీఏ అవకాశం కల్పించడంతో తప్పులు సరిచేసుకునేందుకు ఏళ్లుగా వేచిచూస్తున్న వారంతా కార్డులు కార్డులోని మార్పులు, అప్‌డేట్‌ కోసం ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆధార్‌ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది

అయితే ముఖ్యంగా 2010 -18 వరకు ఆధార్‌ నమోదు చేసుకున్న కార్డుదారులు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు తండ్రి పేరిట ఉన్న మహిళల కార్డులు వివాహానంతరం భర్త పేరు మార్చుకునేందుకు గతంలో వీలు ఉండేది కాదు. దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటిని కూడా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. డబ్భు ఏళ్లు దాటిన వారికి మార్పు చేర్పులకు మినహాయింపునిచ్చారు. తప్పొప్పులు సవరించుకునే వారు తమ పదో తరగతి మెమో, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, పాస్‌ పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాల్సి ఉంటుంది. అందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్‌ కార్డు జారీ చేశారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది యూఐడీఏఐ.

మై ఆధార్‌ పోర్టల్‌, ఎం-ఆధార్‌ యాప్‌ ద్వారా myaadhaar.uidai.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి. ఆధార్‌ అప్డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్లోడ్‌ చేయాలి. అనంతరం చిరునామా నిరూపించే పత్రాన్ని అప్‌లోడ్‌ చేసి సమర్పించాలి. వెంటనే ఆధార్‌ అప్డేట్‌ పూర్తయినట్లు ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సేవ పూర్తిగా ఉచితం. ఎవరైన డబ్బులు వసూలు చేసినట్లయితే సంబంధిత ఆధార్‌ సెంటర్‌ కోడ్‌ నెంబర్‌తో టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి