Aadhaar Card Alert: ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకున్నారా.. ఇలాంటి మెసెజ్ వచ్చిందా.. వెంటనే ఏం చేయాలో తెలుసా..

|

Aug 18, 2023 | 7:35 PM

Aadhaar Card Update: ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకున్నారా.. మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోండి.. ఇలాంటి మెసెజ్‌లు ఈ మధ్యకాలంలో మన ఫోన్లకు చాలా వస్తున్నాయి. ఇలాంటి మెసెజ్‌లు మీకు కూడా వస్తుంటే వెంటనే నెమ్మకండి. ప్రజలు తాజాగా అప్రమత్తంగా ఉండాలని యూఐడీఏఐ కోరింది. UIDAI నుంచి వచ్చిది అనుకున్ని చాలా మంది మోస పోతున్నారు.

Aadhaar Card Alert: ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకున్నారా.. ఇలాంటి మెసెజ్ వచ్చిందా.. వెంటనే ఏం చేయాలో తెలుసా..
Aadhaar
Follow us on

మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా మీ పత్రాలను పంపమని మీకు సందేశాలు వస్తున్నాయా..? అలాంటి మెసెజ్‌లతో జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని మోసం చేసే మరో కొత్త మార్గం. సెబర్ నేరగాళ్లు కొత్త పద్దతిని ఎంచుకున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఐడీఏఐ కోరింది. ఆధార్ అప్‌డేట్ కోసం అవసరమైన పత్రాలను ఇమెయిల్ ద్వారా లేదా వాట్సాప్‌లో పంపమని ఎవరినీ అడగదని UIDAI తెలిపింది.

పౌరులు తమ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లడం ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా మీ #ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీ POI/POA పత్రాలను భాగస్వామ్యం చేయమని UIDAI మిమ్మల్ని ఎప్పుడూ అడగదని UIDAI Xలో పోస్ట్ చేసింది. #myAadhaarPortal ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయండి లేదా మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లండి.

UIDAI వివరాలను అప్‌డేట్ చేస్తోంది..

UIDAI వారి జనాభా వివరాలను తిరిగి ధృవీకరించడానికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు (POI/PoA) పత్రాలను అప్‌లోడ్ చేయమని ప్రజలను అడుగుతోంది, ప్రత్యేకించి ఆధార్ 10 సంవత్సరాల క్రితం జారీ చేయబడి. ఎప్పుడూ అప్‌డేట్ చేయబడలేదు. ఇది మెరుగైన సర్వీస్ డెలివరీలో సహాయపడుతుంది. ప్రామాణీకరణ విజయ రేటును పెంచుతుంది. ఇంతలో, UIDAI పత్రాల ఉచిత ఆధార్ నవీకరణను 14 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించింది. ఇంతకు ముందు, ఉచిత సర్వీస్ సర్వీస్ జూన్ 14, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండేది.

ఆధార్ కార్డ్ అప్‌డేట్: ఈ ఉచిత సేవను ఎలా పొందాలి

  1. నివాసితులు తమ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి అధికారిక వెబ్ సైట్ కి లాగిన్ చేయవచ్చు.
  2. ‘చిరునామాను నవీకరించడానికి కొనసాగండి’ ఎంపికను ఎంచుకోండి.
  3. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపబడుతుంది
  4. మీరు ‘అప్‌డేట్ డాక్యుమెంట్’పై క్లిక్ చేస్తే చాలు, నివాసి ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.
  5. ఆధార్ హోల్డర్ వివరాలను ధృవీకరించాలి, సరైనదని తేలితే, తదుపరి హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి.
  6. తదుపరి స్క్రీన్‌లో, నివాసి డ్రాప్‌డౌన్ జాబితా నుండి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలను ఎంచుకోవాలి.
  7. చిరునామా రుజువు స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, ‘సమర్పించు’ బటన్‌ను ఎంచుకోండి. వాటిని అప్‌డేట్ చేయడానికి మీ పత్రాల కాపీలను అప్‌లోడ్ చేయండి.
  8. ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించబడుతుంది. 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం