AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై జిరాక్స్ కాపీలు అక్కర్లేదు.. వచ్చే ఏడాది నుంచి కొత్త సదుపాయం..

ఆధార్ ధృవీకరణ కోసం జిరాక్స్ కాపీలు అందిస్తున్నారా.. ఇందుకోసం ఫొటోకాపీలను మీ వెంట ఉంచుకోవాల్సి వస్తోందా.. ఇక నుంచి ఆ తిప్పలు తొలగిపోనున్నాయి. ఈ మేరకు యూఐడీఏఐ ఆఫ్‌లైన్ ధృవీకరణ వ్యవస్థను తీసుకొస్తోంది. దీని ద్వారా యాప్ ద్వారానే వెరిఫికేషన్ పూర్తమవుతుంది.

Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై జిరాక్స్ కాపీలు అక్కర్లేదు.. వచ్చే ఏడాది నుంచి కొత్త సదుపాయం..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Nov 07, 2026 | 2:03 PM

Share

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించింది. ఇప్పటివరకు ఏదైనా ప్రాంతంలో ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్స్ అందించాల్సి వచ్చేది. ఇందుకోసం ఆధార్ జిరాక్స్ కాపీని వెంట పెట్టుకోవాల్సి వచ్చేది. దీని వల్ల మీ ఆధార్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆధార్ జిరాక్స్ కాపీని మీకు తెలియకుండా వేరే అవసరాల కోసం ఉపయోగించవచ్చు. దీని వల్ల మీ వ్యక్తిగత వివరాలకు భంగం వాటిల్లుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు యూఐడీఏఐ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. ఇక నుంచి డిజిటల్ విధానం ద్వారా ఆఫ్‌లైన్‌లో ఆధార్ ధృవీకరణ పూర్తి చేసేలా కొత్త వ్యవస్థను యూఐడీఏఐ తీసుకొస్తుంది.

యాప్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్

యూఐడీఏఐ ఆఫ్ లైన్ ఆధార్ ధృవీకరణ వ్యవస్థను తీసుకొస్తోంది. ఇప్పటివరకు 300 సంస్థలు ఈ వెరిఫికేషన్ సిస్టమ్ కోసం నమోదయ్యాయి. ఈ సంస్థల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, స్విగ్గీ, జొమాటో లాంటి క్విక్ కామర్స్ కంపెనీలు, నిర్వహణ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసే వ్యవస్థను అందించనుంది. దీని వల్ల వినియోగదారులు ఆధార్ జిరాక్స్‌ను అందించాల్సిన అవసరం లేదు. దీని వల్ల మరింత వేగంగా సేవలు పొందవచ్చు. ఇప్పటివరకు ఆధార్ జిరాక్స్ అందించాల్సిన రావడం వల్ల సేవలు పొందటంలో జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమస్య తొలగిపోనుంది. మీరు హోటల్‌కు వెళ్లినప్పుడు ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన పని లేదు. యాప్ ద్వారానే ధృవీకరణ ప్రక్రియ పూర్తమవుతుంది. అలాగే పలు ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు కూడా జిరాక్స్ కాపీ అందించకుండానే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

జనవరి నుంచి ప్రారంభం

2027 జనవరి నుంచి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవస్థను ప్రైవేట్ కంపెనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటికి అనుసంధానించేందుకు యూఐడీఏఐ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఫొటోకాపీల స్థానంలో యాప్ ఆధారిత డిజిటల్ గుర్తింపు ప్రక్రియను అమల్లోకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉంది. ఒక ఏడాదిలో 100కిపైగా సంస్థలను ఈ వ్యవస్థలోకి తీసుకురాగా.. మరిన్ని సంస్థలకు విస్తరించనుంది. కాగితపు పనిని తగ్గించడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా రక్షించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఆస్పత్రులు, హోటళ్లు, విద్యాసంస్థల వద్ద ఆధార్ ధృవీకరణ అసవరమైనప్పుడు కేవలం వినియోగదారుడు సమ్మితి తెలియచేస్తే సరిపోతుంది. వినియోగదారుడి గుర్తింపు వివరాలు యాప్ ద్వారా పంచుకోబడతాయి. ఇక గ్యాస్, వాటర్, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకుల్లో ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం పడుతుంది.

Follow Us