Credit Card Payments: ఆ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టే వారికి షాక్.. బిల్లుల చెల్లింపు కుదరని ఆర్‌బీఐ నిర్ణయం

|

Jun 24, 2024 | 1:30 PM

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా పెరుగుతున్న ఖర్చుల వల్ల చేబదులు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే చిన్న చిన్న అవసరాలకు వేరే వారి దగ్గర చేయి చాచే బదులు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆ సమస్య ఉండదని భావిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుదారులు ఇటీవల కాలంలో బిల్లుల చెల్లింపులకు వివిధ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఫోన్ పే, క్రెడ్, బిల్ డెస్క్, ఇన్ఫిబీమ్ ఎవెన్యూస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Credit Card Payments: ఆ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టే వారికి షాక్.. బిల్లుల చెల్లింపు కుదరని ఆర్‌బీఐ నిర్ణయం
Rbi
Follow us on

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా పెరుగుతున్న ఖర్చుల వల్ల చేబదులు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే చిన్న చిన్న అవసరాలకు వేరే వారి దగ్గర చేయి చాచే బదులు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆ సమస్య ఉండదని భావిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుదారులు ఇటీవల కాలంలో బిల్లుల చెల్లింపులకు వివిధ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఫోన్ పే, క్రెడ్, బిల్ డెస్క్, ఇన్ఫిబీమ్ ఎవెన్యూస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఆయా యాప్స్‌కు షాక్ ఇచ్చేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.  ఇకపై బీబీపీఎస్ నిబంధనలు పాటించని యాప్స్ ద్వారా బిల్లుల చెల్లింపులను తిరస్కరించాలని ఆయా బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలను ఇచ్చింది.  ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ప్రస్తుతం భారతదేశంలో 50 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసిన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఇంకా బీబీపీఎస్ సమ్మతిని ప్రారంభించలేదు. పర్యవసానంగా ఈ బ్యాంకులు కొత్త ఆదేశాలను పాటించకపోతే జూన్ 30 తర్వాత కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను క్రెడిట్ కార్డ్ బిల్లులను జూన్ 30 తర్వాత క్రెడ్, ఫోన్ పే వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లించలేరు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూన్ 30 నాటికి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఫోన్ పే, క్రెడ్ వంటి వంటి ఫిన్‌టెక్ కంపెనీలు బీబీపీఎస్‌లో సభ్యులుగా ఉన్నప్పటికీ వాటి ద్వారా క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లించేరని స్పష్టం చేసింది. ముఖ్యంగా బ్యాంకులు కచ్చితంగా ఆదేశాలు పాటించాలన పేర్కొంది. 

ఫిన్‌టెక్ కార్యకలాపాలు సజావుగా కొనసాగాలంటే రుణదాతలు జూన్ 30 గడువులోగా ఆర్‌బీఐ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆర్‌బీఐ తాజా నిర్ణయంపై ఫిన్‌టెక్ బ్యాంకులు 90 రోజుల పొడిగింపును కోరింది. ప్రస్తుతం 34 అధీకృత క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులలో ఎనిమిది మాత్రమే బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపులను ప్రారంభించాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ మరియు, కార్డ్ ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ చర్యలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కేంద్రీకృతం చేయడంతో పాటు మోసపూరిత లావాదేవీలను గుర్తించడంలో సహాయం చేస్తుంది. ఈ కేంద్రీకరణ చెల్లింపు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే, నియంత్రించే సామర్థ్యాన్ని అందిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి