New Investment Rules: పోస్టాఫీసులో పెట్టుబడిదారులకు షాక్.. ఆ రూల్స్ మారాయోచ్చ్..! పాలసీ కావాలంటే అవి తప్పనిసరి

|

May 31, 2023 | 5:00 PM

చిన్న పొదుపు పథకాల్లో పాల్గొనే పెట్టుబడిదారుల కోసం "మీ కస్టమర్‌ను తెలుసుకోండి" (కేవైసీ) నిబంధనలలో మార్పును సూచిస్తూ ఇండియా పోస్ట్‌ ఇటీవల ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ మారిన నిబంధనలు కచ్చితంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి ఇబ్బందిగా మారతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

New Investment Rules: పోస్టాఫీసులో పెట్టుబడిదారులకు షాక్.. ఆ రూల్స్ మారాయోచ్చ్..! పాలసీ కావాలంటే అవి తప్పనిసరి
Post Office
Follow us on

పోస్టాఫీస్ పొదుపు పథకాలు నెలవారీ ప్రాతిపదికన పొదుపు, పెట్టుబడి పెట్టాలని కోరుకునే వ్యక్తులను విపరీతంగా ఆకర్షించాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌ అంటే గ్రామీణులకు ఎనలేేని నమ్మకం. పోస్టాఫీసు పథకాలు పొదుపు, పెట్టుబడి కోసం అనేక ఎంపికలను అందిస్తాయి. ఇటీవలి పరిణామాలు ఈ పథకాలను నియంత్రించే పెట్టుబడి నిబంధనల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాయి. చిన్న పొదుపు పథకాల్లో పాల్గొనే పెట్టుబడిదారుల కోసం “మీ కస్టమర్‌ను తెలుసుకోండి” (కేవైసీ) నిబంధనలలో మార్పును సూచిస్తూ ఇండియా పోస్ట్‌ ఇటీవల ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ మారిన నిబంధనలు కచ్చితంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి ఇబ్బందిగా మారతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా పోస్ట్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు తమ కేవైసీ డాక్యుమెంట్‌లతో పాటు ఆదాయ రుజువును అందించాల్సిన అవసరం ఉంది. చిన్న పొదుపు పథకాల్లో పాల్గొనే నిర్దిష్ట వర్గం ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ రుజువులను సేకరించాలని తపాలా శాఖ అన్ని పోస్టాఫీసులను ఆదేశించింది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ కార్యకలాపాలను అరికట్టడమే ఈ సవరణ వెనుక లక్ష్యంగా తెలుస్తుంది. పర్యవసానంగా పెట్టుబడిదారులు ఇప్పుడు పాన్, ఆధార్ వివరాలతో పాటు ఆదాయ రుజువును సమర్పించాల్సి ఉంటుంది. తాజా సర్క్యూలర్ పెట్టుబడిదారులను వారి రిస్క్ ఆధారంగా మూడు విభిన్న వర్గాలుగా వర్గీకరిస్తుంది. వర్తించే నియమాలు, నిబంధనలను నిర్ణయించడానికి ఈ వర్గాలే ఆధారంగా ఉంటాయి. 

ఇవి కూడా చదవండి
  • రూ. 50,000కు మించని మొత్తంతో ఏదైనా స్కీమ్‌లో ఖాతాను తెరిచి, అన్ని పోస్టాఫీసు స్కీమ్‌లలో ఈ థ్రెషోల్డ్ కంటే తక్కువ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేసే పెట్టుబడిదారులు తక్కువ-రిస్క్ ఇన్వెస్టర్లుగా పరిగణిస్తారు.
  • రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంతో ఖాతాలను ప్రారంభించే కస్టమర్లు, అయితే రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు మధ్యస్థ-రిస్క్ పెట్టుబడిదారులుగా వర్గీకరిస్తారు. అన్ని స్కీమ్‌ల్లో  సంచిత బ్యాలెన్స్ రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రూ. 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి మీడియం-రిస్క్‌గా వర్గీకరిస్తారు. 
  • పెట్టుబడి రూ. 10 లక్షల థ్రెషోల్డ్‌ను అధిగమించిన తర్వాత, సంబంధిత కస్టమర్ హై-రిస్క్ ఇన్వెస్టర్‌గా పరిగణిస్తారు. వీరికి మరింత కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి