EV Scooter Update: ఏథర్ ఈవీల్లో సరికొత్త సమస్య.. ఆఫీస్‌కు లేట్ అయ్యిపోతుందని కొనుగోలుదారుల గగ్గోలు

నోయిడాకు సంబంధించిన ఓ వ్యక్తికి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తనను తాను అప్‌డేట్ చేసుకోవడానికి కరెక్ట్ అతడు ఆఫీస్‌కు వెళ్లే ముందు సమయాన్ని ఎంచుకుంటుంది. దీంతో అతడు ప్రతిరోజూ ఆఫీస్‌కు లేట్‌గా వెళ్తున్నాడు. 'ఎక్స్'లో నోయిడాకు చెందిన ప్రతీక్ రాయ్ తన అసాధారణ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏథర్ స్కూటర్స్‌కు వస్తున్న తాజా సమస్య గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EV Scooter Update: ఏథర్ ఈవీల్లో సరికొత్త సమస్య.. ఆఫీస్‌కు లేట్ అయ్యిపోతుందని కొనుగోలుదారుల గగ్గోలు
Ather Update

Updated on: Apr 07, 2024 | 8:00 AM

ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం సర్వసాధారణం. అయితే ఇటీవల ఓ ఏథర్ యూజర్ స్కూటర్ అప్‌డేట్ అవుతున్నందున ఆఫీస్‌కు లేట్‌గా వెళ్తున్నాని వాపోతున్నాడు. వినడానికి కొంత కొత్తగా ఉన్న ఇది నిజమే. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఉద్యోగస్తులు ఈ కారణం చెప్పాల్సి వస్తుందని నెటిజన్లు జోక్స్ వేస్తున్నారు. నోయిడాకు సంబంధించిన ఓ వ్యక్తికి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తనను తాను అప్‌డేట్ చేసుకోవడానికి కరెక్ట్ అతడు ఆఫీస్‌కు వెళ్లే ముందు సమయాన్ని ఎంచుకుంటుంది. దీంతో అతడు ప్రతిరోజూ ఆఫీస్‌కు లేట్‌గా వెళ్తున్నాడు. ‘ఎక్స్’లో నోయిడాకు చెందిన ప్రతీక్ రాయ్ తన అసాధారణ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏథర్ స్కూటర్స్‌కు వస్తున్న తాజా సమస్య గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

తన స్కూటర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉదయం ఆఫీస్‌కు బయలుదేరబోతున్న సమయంలోనే ప్రారంభమైందని, అప్‌డేట్ పూర్తయ్యే వరకు ఒంటరిగా ఉండిపోయానని అతను వివరించాడు. పని చేయడం ఆలస్యమైనందుకు ట్రాఫిక్ లేదా కార్ బ్రేక్‌డౌన్‌లను నిందించడం సర్వసాధారణమైనప్పటికీ రాయ్ పరిస్థితి సరికొత్తగా ఉంది. ముఖ్యంగా ప్రతీక్ రాయ్ తన సమస్యను వివరిస్తూ ఏథర్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడుపుతూ అతని ప్రత్యేకమైన గందరగోళానికి నిదర్శనంగా ఒక వీడియోను షేర్ చేశాడు. . ఉదయం స్కూటర్‌ను ఆన్ చేయగానే మై ఏథర్ అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. దీంతో నేను ఆఫీస్‌కు లేట్‌గా వెళ్లాను అని ఎక్స్‌లో పేర్కొన్నాడు. అయితే ఎక్స్‌లో అతని పోస్ట్ దాదాపు 4,00,000 మంది చూశారు. దీంతో చాలా మంది  ఈ వింత సంఘటనపై కామెంట్లు పెడుతున్నారు. ఒక వినియోగదారు “కొత్త సాకు విండో” అని వ్యాఖ్యానిస్తే, మరికొంత మంది మాత్రం విండోస్ అప్‌డేట్ వల్ల ఆఫీస్‌ మీటింగ్‌కు వెళ్లలేకపోతే, స్కూటర్ అప్‌డేట్ వల్ల ఆఫీస్‌కు లేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

 

అయితే ఈ సమస్యపై ఏథర్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. మేము మీ సమస్యను గమనించామని, సంబంధిత బృందంతో భాగస్వామ్యం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని అందిస్తామని పేర్కొంది. అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమ సిబ్బంది సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి