AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Scam: వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రూ.50 లక్షలు హాంఫట్.. వెలుగులోకి నయా స్కామ్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాల కేసులు బాగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెరిగిన టెక్నాలజీనీ ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. పెట్టుబడిపై ఆసక్తిగా ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని పెట్టుబడి పేరుతో భారీగా మోసాలు చేసే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన్ అయితే తెలివిగా అతడిని మోసగించి రూ. 50 లక్షలు కొట్టేశారు.

Investment Scam: వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రూ.50 లక్షలు హాంఫట్.. వెలుగులోకి నయా స్కామ్
తర్వాత 'Next'పై క్లిక్ చేసి మీ పాత, కొత్త మొబైల్ నంబర్లను నమోదు చేయండి. మొబైల్ నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.
Nikhil
|

Updated on: Nov 05, 2024 | 4:31 PM

Share

హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నిర్వహించిన మోసపూరిత స్టాక్ మార్కెట్ స్కీమ్‌కు బలి అయ్యాడు. స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరిన వ్యక్తితో గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ కునాల్ సింగ్ తన స్టాక్ ట్రేడింగ్ మార్గదర్శకత్వం మునుపటి క్లయింట్‌లకు అసాధారణమైన రాబడిని తెచ్చిపెట్టిందని పేర్కొంటూ తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు. స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడికి సంబంధించిన వ్యూహాలను నేర్చుకోవాలనే ఆశతో ఆ వ్యక్తి ప్రతిపాదిత ఆన్‌లైన్ తరగతుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్‌ల ద్వారా సెషన్‌లు నిర్వహిస్తామని తెలపడంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపై ఆసక్తి ఉండడంతో ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యారు. దీంతో బాధితుడిని స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా పెట్టుబడి పెట్టమని చెప్పడంతో అలాగే చేశాడు. 

మొదట్లో  బాధితుడు చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టించుకున్న మోసాగాళ్లు మంచి లాభాలను అందించారు. దీంతో ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరడదంతో దఫదఫాలుగా రూ. 50 లక్షల పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ వెబ్‌సైట్ ద్వారా బాధితుడు తన లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని సాధ్యం కాలేదు దీంతో బాధితుడు తాను మోసపోయాయని గ్రహించుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బెదిరింపుల గురించి తెలియని వృద్ధులు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వాట్సాప్ గ్రూప్‌లు ఇతర ఏ సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంపై ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక సలహాదారులు, సంస్థలు సాధారణంగా వాట్సాప్ ద్వారా పని చేయరనే చిన్న విషయం గుర్తు ఉంచుకుంటే పెద్ద మోసాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అంతర్గతంగా ప్రమాదకరమనే విషయాన్ని పెట్టుబడిదారులు గ్రహించాలని కోరతున్నారు. ముఖ్యంగా ఏ ఆర్థిక నిపుణుడు 500 శాతం రాబడి వస్తుందని చెప్పరని, మోసపూరిత వాట్సాప్ గ్రూప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి