బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం తగ్గినట్లే తగ్గిన బంగారం ధర శనివారం మళ్లీ పెరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ. 110 పెరగడం గమనార్హం. దీంతో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం రూ. 60 వేలు దాటేసింది. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఓవైపు బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్ స్థిరంగా కొనసాగింది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330గా ఉంది. ఇక ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,150గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం భాగ్యనగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,000గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో శనివారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,000గా ఉంది.
బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో శనివారం పెద్దగా మార్పు కనిపించలేదు. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ముంబయిలో రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 77,500గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..