AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prices: అయ్య బాబోయ్.. ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.830.. ఎక్కడో తెలుసా..?

ఢిల్లీలో రూ.75గా ఉన్న ప్లేట్ పానీపూరీ.. లండన్‌లో ఏకంగా రూ.800పైన పలుకుతోంది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమేనండి బాబూ.. ఇదెక్కడో కాదు హల్దీరామ్ అవుట్ లెట్‌లో. లండన్ అవుట్‌లెట్‌లో ధరల మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

Prices: అయ్య బాబోయ్.. ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.830.. ఎక్కడో తెలుసా..?
Pani Puri
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 11:53 AM

Share

వీధి వ్యాపారుల దగ్గర ప్లేట్ పానీపూరీ రూ.20 ఉంటుంది. అదే పెద్ద చాట్ దుకాణాల్లో రూ.50 వరకు ఉండవచ్చు. హల్దీరామ్స్ లాంటి ప్రీమియం ఫుడ్ షాపుల్లో రూ.100 వరకు కూడా ఉండే అవకాశముంది. కానీ ప్లేట్ పానీపూరీ రూ.830 అయితే.. ఇది వినే మీరు ఆశ్చర్యపోతున్నాయి. అవును కానీ ఇది భారత్‌లో కాదు.. లండన్‌లో ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.830 పలుకుతుంది. ఇండియాలో హల్దీరామ్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్నాక్స్, చాట్ లాంటి ఫుడ్ ఐటమ్స్‌తో ప్రజాదరణను సంపాదించుకుంది. కొత్తగా లండన్‌లో కూడా హల్దీరామ్స్‌ తన బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఈ బ్రాంచ్‌ను సందర్శించి ఫుడ్‌ను ఆస్వాదించేందుకు ఎన్నారైలు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వామ్మో.. ప్లేట్ ప్లానీపూరీ ఎంతంటే..?

పానీపూరీ, చోలే భటూరే, చాట్, ఇతర దేశీయ వంటకాలను ఇక్కడ తినేందుకు ఎన్నారైలు క్యూ కడుతున్నాయి. కస్టమర్ల సంగతి అలా ఉంచితే.. ఇక్కడ మెనూ ధరలే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీలోని హల్దీరామ్స్‌లో ఒక ప్లే్ట్ పానీపూరీ రూ. 75గా ఉంది. కానీ అదే పానీపూరీ లండన్‌లో 6.50 పౌండ్లు (సుమారు రూ. 830)గా ఉంది. పావ్ భాజీ ఢిల్లీలో రూ. 198గా ఉండగా.. లండన్‌లో 9.90 పౌండ్లు (సుమారు రూ. 1270)గా ఉంది. గార్లిక్ నాన్ ధర ఢిల్లీలో రూ. 95గా ఉండగా.. లండన్‌లో 5 పౌండ్లు (సుమారు రూ. 640)గా ఉంది. ఈ ధరలకు సంబంధించి మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అధిక నిర్వహణ ఖర్చులు, దిగుమతి ఖర్చులు, స్థానిక పన్నుల కారణంగా ధరలు అక్కడ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

లండన్ అవుట్‌లెట్‌లో పరిమిత వంటకాలు

భారత్‌లోని హల్దీరామ్స్‌తో పాటు పోలిస్తే లండన్‌లోని అవుట్ లెట్ మోనూ భిన్నంగా ఉంది. ఢిల్లీలోని హల్దీరామ్స్ ఉత్తర భారతీయ, దక్షిణ భారతీయ, చైనీస్, కాంటినెంటల్, శాండ్‌విచ్‌లు, స్వీట్లు, పానీయాలతో సహా 80కి పైగా వంటకాలను అందిస్తుంంది. అదే లండన్ అవుట్‌లెట్‌లో జాగ్రత్తగా ఎంపిక చేసిన సుమారు 40 వంటకాలు మాత్రమే ఉన్నాయి. దక్షిణ భారతీయ ఇష్టమైన వంటకాలు, చైనీస్ వంటకాలు, శాండ్‌విచ్‌లు, డెజర్ట్‌ల వంటి మొత్తం విభాగాలను తొలగించారు. దానికి బదులుగా ప్రవాస భారతీయులకు.. భారతీయ వంటకాలను మొదటిసారి రుచి చూస్తున్న వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉన్న ప్రసిద్ధ ఉత్తర భారతీయ వీధి ఆహారం, సౌకర్యవంతమైన వంటకాలపై గట్టిగా దృష్టి పెట్టారు. దీంతో అక్కడ ఎన్‌ఆర్‌ఐలను ఆకట్టుకుంటుంది.

Follow Us