Ex-gratia Compensation: ఇక నుంచి ఉద్యోగి మరణిస్తే పరిహారం వారికే.. నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం

|

Oct 03, 2021 | 5:53 AM

Ex-gratia Compensation: విధుల్లో ఉండి మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యగులకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఉద్యోగి బతికి..

Ex-gratia Compensation: ఇక నుంచి ఉద్యోగి మరణిస్తే పరిహారం వారికే.. నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం
Follow us on

Ex-gratia Compensation: విధుల్లో ఉండి మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యగులకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఉద్యోగి బతికి ఉండగా తన కుటుంబంలో ఎంపిక చేసిన నామినీ లేదా నామినీలకు ఇకపై పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు పరిహారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రత్యేక నిబంధనలేమీ లేకపోవడంతో.. సీసీఎస్‌ రూల్స్‌ ప్రకారం.. ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్‌కు అర్హులైన వారికి పరిహారాన్ని అందజేస్తూ వచ్చారు. అయితే మరణించిన ఉద్యోగి కుటుంబానికి డెత్‌ గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ బ్యాలెన్స్‌, సీజీఈజీఐఎస్‌లన్నింటినీ కలిపి ఒకేసారి పరిహారం కింద చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

ఎవరినీ నామినేట్‌ చేయకపోతే..

ఉద్యోగి బతికుండగా ఎవరినీ నామినేట్‌ చేయకపోయినా.. లేదా నామినీ జీవించి లేకపోయినా.. పరిహారాన్ని కుటుంబసభ్యులందరికి సమానంగా పంచుతారు. సీసీఎస్‌(పెన్షన్‌) నిబంధనల్లో రూల్‌ 51 ప్రకారం.. గ్రాట్యుటీ విషయంలో అవలంబిస్తున్న విధానాన్నే దీనికీ వర్తింపజేస్తారు.

కుటుంబేతర వ్యక్తిని నామినీగా ఎంపిక చేయవచ్చా..?

ఉద్యోగి ఎట్టిపరిస్థితుల్లో తన కుటుంబంతో సంబంధం లేని బయటి వ్యక్తిని నామినీగా ఎంపిక చేయడానికి అవకాశం లేదు. పరిహారాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగికి సొంత కుటుంబం అంటూ లేకపోయినా.. బయటి వ్యక్తులను మాత్రం నామినేట్‌ చేయడానికి వీలు లేదు.

ఇవీ కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!