7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరగనున్న డీఏ.. ఎప్పుడంటే..!

|

Jun 04, 2022 | 4:46 PM

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వచ్చే నెల నుంచి కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం భారీ ప్రకటన చేయనుంది. డియర్‌నెస్ అలవెన్స్- డిఏ..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరగనున్న డీఏ.. ఎప్పుడంటే..!
Follow us on

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వచ్చే నెల నుంచి కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం భారీ ప్రకటన చేయనుంది. డియర్‌నెస్ అలవెన్స్- డిఏ పెంపు వచ్చే నెలలో అంటే జూలైలో ఉండవచ్చు. మీడియా కథనాల ప్రకారం.. జూలై 1న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ పెంపును అమలు చేసే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా ప్రభుత్వం జనవరి, జూలైలో DAని సవరిస్తుందని తెలుస్తోంది. కేంద్రం వేతనాల అంశానికి సంబంధించి వచ్చే నెలలో కీలక ప్రకటన చేసే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం 7వ వేతన సంఘం కింద డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్‌లు 3 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏఐసీపీఐ 126 కంటే ఎక్కువగా ఉంటే డీఏ 4 శాతం వరకు పెరగవచ్చు. ఏఐసీపీఐ జనవరి, ఫిబ్రవరిలో వరుసగా 125.1, 125 ఉండగా, మార్చిలో 126కి పెరిగింది. ఇప్పుడు ఏఐసీపీఐ ఆ స్థాయిలోనే కొనసాగితే డీఏ 4 శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగులు వారి ప్రాథమిక వేతనంపై 34% DA పొందుతున్నారు. 4 శాతం పెంచిన డీఏను అమలు చేస్తే వారికి వారి బేసిక్ జీతంపై 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ఇస్తారు.

డీఏ పెంచిన తర్వాత జీతం ఎంత పెరుగుతుంది?

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న డీఏ రేటును ఉద్యోగి ప్రాథమిక వేతనంతో గుణించడం ద్వారా 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది. ప్రాథమిక వేతనం రూ.18,000 ఉన్న ఉద్యోగి వేతనానికి వ్యతిరేకంగా ఈ లెక్కల విధానం కొనసాగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగికి 31 శాతం డీఏ చొప్పున రూ.6,120 డీఏ లభిస్తోంది. జూలైలో డీఏను 4 శాతం పెంచితే ఉద్యోగికి రూ.6,840 డీఏ లభిస్తుంది. అంటే తాజా డీఏ పెంపు తర్వాత రూ.720 పెరగనుంది.

ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది:

ద్రవ్యోల్బణం తగ్గించేందుకు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలైలలో DA పెంచుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ఠ స్థాయిలో ఉన్నందున, డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ ఉద్యోగిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది అర్బన్ సెక్టార్, సెమీ అర్బన్ సెక్టార్ లేదా రూరల్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం డీఏ లభిస్తుండగా, జనవరిలో 31 శాతం ఉన్న డీఏను 3 శాతానికి పెంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి