Startup Success Story: 70 మంది ఇన్వెస్టర్లు తిరస్కరించిన స్టార్టప్.. చివరికి విజయవంతం.. భార్యాభర్తల సక్సెస్ స్టోరీ..

Startup Success Story: విడివిడిగా సొంత యూనికార్న్(Unicorn) స్టార్టప్ కంపెనీలు కలిగి ఉన్న మెుట్టమెుదటి భార్యాభర్తలుగా ఆసిష్ మోహపాత్ర, రుచి కల్రా దంపతులు నిలిచారు. వీరికి ఆఫ్‌బిజినెస్, ఆక్సిజో అనే స్టార్టప్‌లు ఉన్నాయి.

Startup Success Story: 70 మంది ఇన్వెస్టర్లు తిరస్కరించిన స్టార్టప్.. చివరికి విజయవంతం.. భార్యాభర్తల సక్సెస్ స్టోరీ..
Startup

Updated on: Apr 20, 2022 | 7:13 AM

Startup Success Story: విడివిడిగా సొంత యూనికార్న్(Unicorn) స్టార్టప్ కంపెనీలు కలిగి ఉన్న మెుట్టమెుదటి భార్యాభర్తలుగా ఆసిష్ మోహపాత్ర, రుచి కల్రా దంపతులు నిలిచారు. వీరికి ఆఫ్‌బిజినెస్, ఆక్సిజో అనే స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ మైలురాయిని సాధించడానికి ముందు వారి స్టార్టప్ వ్యాపార ఆలోచనను 70 మంది ఇన్వెస్టర్లు తిరస్కరించారు. కానీ పట్టువదలని ఈ దంపతులు తమ కలను నిజం చేసుకునేందుకు ముందుకు సాగారు. ముందుగా.. ఆఫ్‌బిజినెస్ అనేది మెటల్స్(Metals), పెట్రోకెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, అగ్రి ఉత్పత్తుల వంటి ముడి పదార్థాలను సేకరించేందుకు SMBS, కొంతమంది పెద్ద క్లయింట్‌లను కూడా అనుమతించే అగ్రిగేషన్ ప్లాట్‌ఫారమ్. ఆఫ్‌బిజినెస్ తన NBFC ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఈ SMEలకు సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ సంస్థాగత క్రెడిట్‌ కూడా అందిస్తోంది. B2B సేకరణలో లావాదేవీలు చాలా పెద్దవిగా ఉన్నాయని ఆఫ్‌బిజినెస్‌కు తెలుసు.. అది విజయవంతం కావడానికి క్రెడిట్‌ను కూడా అందించాలి. అందుకే.. ఆఫ్‌బిజినెస్ బిజినెస్, క్రెడిట్ రెండింటికి సంబంధించిన వ్యాపారంగా మారటంతో విజయవంతంగా నడుస్తోంది. రెండు వ్యాపారాలు విజయవంతం సాధించటం ఒక అపూర్వమైన చర్యగా చెప్పుకోవాలి.

వ్యాపారాన్ని ప్రారంభించిన ఆరు సంవత్సరాల తర్వాత.. ఆఫ్‌బిజినెస్ ఒక యునికార్న్ కంపెనీగా మారింది. గత సంవత్సరం డిసెంబర్ లో ఈ మైలురాయిని కంపెనీ చేరుకుంది. ప్రస్తుతం దీని వ్యాపార విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉంది. మరో కంపెనీ అయిన.. ఆక్సియోజో ఈ సంవత్సరం మార్చిలో యునికార్న్‌గా అవతరించింది. సిరీస్- A రౌండ్‌లోనే 200 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఇది సేకరించింది. Pay Tm తర్వాత దేశంలో.. 2 బిలియన్ డాలర్లను సేకరించేందుకు ఆక్సియోజో త్వరలోనే IPOకి వచ్చేందుకు అవకాశం ఉంది.

ఈ స్టార్టప్ కు అతిపెద్ద సవాలు ఏమిటంటే.. పెద్ద ఆటగాళ్లు కూడా పూర్తిగా క్రెడిట్‌పై నడిపేందుకు మార్కెట్‌లో పనిచేయడానికి ఉత్తమమైన మార్గాన్ని గుర్తించటమే. మరొక అడ్డంకి ఏమిటంటే సాంకేతికతను స్వీకరించకపోవడం. ఎందుకంటే.. కొనుగోలుదారులు, విక్రేతలు ఒప్పందాలను కుదుర్చుకునే ముందు వ్యక్తిగతంగా కలవాలనుకోవటం. అనేక బ్రాండ్‌లతో ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడం, నాన్-మెట్రోస్‌లో పనిచేసేలా కార్మికులను ఒప్పించడం, ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించమని వారిని ఒప్పించేందుకు చిన్న పట్టణాల్లోని కొనుగోలుదారులు, సరఫరాదారులను ఒప్పించటం వంటివి స్టార్టప్ దాటాల్సిన ఇతర అడ్డంకులు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stocks: కేవలం మూడు నెలల్లో లక్షను.. 13.18 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..

Sri Lanka Crisis: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి.. లంకలో కొనసాగుతున్న ఆందోళనలు..