
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడాలా.. వద్దా..? క్యాసినోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారా అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, కాసినోలపై 28 శాతం వస్తువులు, సేవల పన్ను లేదా జీఎస్‌టీ విధించబడుతుంది. మంగళవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై జీఎస్టీ విధించాలని కేంద్రం చాలా కాలంగా యోచిస్తోందని. ఎట్టకేలకు నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు.
ఒక ఉత్పత్తిపై విధించే GST శాతాన్ని బట్టి, ఉత్పత్తి ధర తగ్గుతుంది లేదా పెరుగుతుంది. ఒక ఉత్పత్తిపై జీఎస్టీ ఎంత శాతం విధించాలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. మంగళవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకుంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం GST విధించాలని మరియు అనేక ఉత్పత్తులపై GSTని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీ విధిస్తారని ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ జీఎస్‌టీ బెట్టింగ్ మొత్తంపై ఆధారపడి ఉంటుందా లేదా గేమింగ్ ద్వారా వచ్చే సగటు ఆదాయంపైనా లేక ప్లాట్‌ఫారమ్ ఫీజుపైనా ఆధారపడి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మిలిపోయింది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై 28 శాతం జీఎస్టీ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. నైపుణ్యం అవసరమయ్యే ఆటలు, అదృష్టంతో గెలిచిన ఆటలు విడిగా నిర్ణయించబడవు. గుర్రపు పందాలు, క్యాసినోలు కూడా 28 శాతం GSTకి లోబడి ఉంటాయి.
అయితే కేవలం జీఎస్టీ పెంపుదల మాత్రమే కాదు, కౌన్సిల్ సమావేశంలో పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించడం లేదా మినహాయించడం కూడా జరిగింది. ఉదాహరణకు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు, అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులపై GST మినహాయింపు ఉంటుంది. ఈ మందులపై ఎటువంటి GST విధించబడదు. తద్వారా ఈ ఔషధాల ధర తగ్గుతుంది.
అంతేకాకుండా, శాటిలైట్ లాంచ్ సర్వీస్‌లలో పాల్గొనే ప్రైవేట్ కంపెనీలకు కూడా GST నుంచి పూర్తిగా మినహాయింపును ఇచ్చింది. ముందుగా వండిన స్నాక్స్ లేదా వండని స్నాక్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. లేస్ నూలుపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహారంపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం