Bank Holidays: ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వినియోగదారులు ముందస్తుగా ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుంటే పనులు సులభమవుతాయి. సమయం వృధా కాకుండా ఆర్థిక నష్టం ఉండకుండా ప్లాన్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతీయ సెలవులయితే మరి కొన్ని జాతీయ సెలవులుంటుంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా హాలిడేస్ లిస్ట్ జారీ చేస్తుంటుంది. వచ్చే జనవరిలోనెల అంటే 2025 జనవరిలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
- జనవరి 1 – న్యూ ఇయర్ సెలవు
- జనవరి 2 – కొత్త ఏడాది సందర్భంగా మిజారంలో, మన్నం జయంతి సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు
- జనవరి 5- ఆదివారం సాధారణంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 6 – గురు గోవింద్ సింగ్ జయంతి హర్యానా, పంజాబ్‌లో సెలవు.
- జనవరి 11 – మిషనరీ డే సెలవు మిజోరాంలో, రెండవ శనివారం
- జనవరి 12 – ఆదివారం సెలవు
- జనవరి 14 – మకర సంక్రాంతి ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు
- జనవరి 15 – మకర సంక్రాంతి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో సెలవు.
- జనవరి -16 కనుమ ఏపీ, తమిళనాడులో సెలవు
- జనవరి 19 -ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- జనవరి 22 – మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు
- జనవరి 23 – గాన్ నగై సందర్భంగా మణిపుర్, నేతాజీ సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, బెంగాల్, జమ్ముకశ్మీర్, ఢిల్లీలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- నవరి 25 – నాలుగవ శనివారం సెలవు
- జనవరి 26 – రిపబ్లిక్ డే సెలవు
- జనవరి 30 – సిక్కింలో సెలవు
ఇది కూడా చదవండి: Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి