కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పండుగ వేళ.. నిర్మలమ్మ భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుతో పార్లమెంట్‌కు వచ్చారు. ప్రతీఏటా బడ్జెట్ రోజున ప్రత్యేకతను చాటుతూ వస్తున్న ఆమె.. ఈసారి కూడా అంతకు మించి అన్నట్లుగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇవాళ ఎరుపు రంగు బ్యాగ్‌లో బడ్జెట్ ట్యాప్‌తో, బ్రౌన్ కలర్ టెంపుల్ బోర్డర్‌లో ఉన్న ఎరుపు చీరతో కనిపించారు. ఇక 2019 నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాసీతారామన్.. ప్రతిఏటా చేనేత చీరనే ధరిస్తున్నారు. బడ్జెట్ పండుగ వేళ చేనేత దుస్తులపై తన ప్రాధాన్యతను, ప్రేమను చాటిచెబుతున్నారు.
వరుసగా 5సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్.. ప్రతీసారి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేక చీరకట్టులో పార్లమెంట్‌కు వస్తున్నారు. తొలిసారి 2019లో బడ్జెట్ ప్రవేపట్టే సందర్భంలో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు. ఆ తరువాతి సంవత్సరం 2020లో ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో ఆకట్టుకున్నారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచికగా పేర్కొంటారు. 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. చాలా సాదాసీదాగా కనిపించి.. తన నిరాడంబరతను చాటుకున్నారు.
FM Nirmala Sitharaman dons traditional temple border red saree to present Union Budget 2023
Read @ANI Story | https://t.co/2n1aD6Jxst#NirmalaSitharaman #Templebordersaree #Saree #UnionBudget2023 #UnionBudget #BudgetSession pic.twitter.com/sxELVKm5Q9
— ANI Digital (@ani_digital) February 1, 2023
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా 2019 నుంచి వరుసగా ఐదుసార్లు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అరుణ్ జైట్లీ (2014-2018), పి.చిదంబరం (2004-2008), యశ్వంత్ సిన్హా (1998-2002), మన్మోహన్ సింగ్ (1991-1995), మొరార్జీ దేశాయ్(1959-1963) ఉన్నారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మెరార్జీ దేశాయ్‌కి చెందుతుంది. ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..