Budget 2021: జాతి ఆస్తులను వారి మిత్రులకు ధారాదత్తం చేస్తున్నారు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. దేశ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం క్యాపిటలిస్ట్‌...

Budget 2021: జాతి ఆస్తులను వారి మిత్రులకు ధారాదత్తం చేస్తున్నారు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Updated on: Feb 01, 2021 | 4:27 PM

Rahul Gandhi comments on Budget 2021: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. దేశ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం క్యాపిటలిస్ట్‌ మిత్రులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్‌ చేశారు. డిమోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారంటూ ౠరోపించారు. ‘జనం చేతుల్లో డబ్బులు ఉంచడానికి బదులు, మోదీ ప్రభుత్వం దేశానికి చెందిన ఆస్తులను తన క్రోనీ క్యాపిటలిస్ట్ మిత్రులకు ధారాదత్తం చేసేందుకు ప్లాన్ చేసింది అంటూ ఆయన ట్విట్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా.. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు పది పాలసీల ప్రిస్కిప్షన్స్‌ను కాంగ్రెస్ కేంద్రానికి సూచించింది. ఇందులో ఒక సూచనగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20 నుంచి 30 శాతం కుటుంబాలకు ఆరు నెలల పాటు నేరుగా నగదు బదీలీ చేయాలని సూచించింది. అయితే ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్‌ సూచించిన ఏ అంశాలు కూడా ప్రస్తావనకు రాలేదు. మోనిటైజేషన్ ప్లాన్‌ ప్రకారం.. జాతికి చెందిన కొన్ని ఆస్తులను ప్రైవేటుపరం చేయనున్నారు.

Also Read:

 

Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్