Parliament Budget Session 2021: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం కూడా అదే గందరగోళం నెలకొంది. ఉదయం ఉభయసభలు ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని, కొత్తసాగు చట్టాలపై స్పందించాలని.. రైతుల సమస్యలను పట్టించుకోవాలంటూ రాజ్యసభ, లోక్‌సభలో విపక్షాలు ఆందోళ చేశాయి. ఈ క్రమంలో లోక్‌సభలో తీవ్రం గందరగోళం నెలకొంది. సభ రెండుసార్లు వాయిదాపడినా.. విపక్ష సభ్యులందరూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభమైన తరువాత రైల్వే గ్రాంట్స్‌పై చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల అంశంపై చర్చ చేపట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది తగదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా.. బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ రైల్వే గ్రాంట్స్ అంశంపై మాట్లాడారు. కీలక సమస్యల పరిష్కారనికి చర్చలు జరపడంలేదంటూ ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రైల్వే ద్వారా సాంస్కృతిక, జాతీయవాదం వృద్ధి చెందుతుందన్నారు. కరోనా మహమ్మారి వేళ భారత రైల్వే ఎంతో సహకరిస్తూ సేవలందించిందని పేర్కొన్నారు. పీపీఈ కిట్ల ట్రాన్స్‌ఫర్, శానిటైజర్లు, నిత్యావసర వస్తువుల పంపిణీలో కీలకపాత్ర పోషించిందన్నారు. అయితే విపక్ష సభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో.. చైర్‌లో ఉన్న మీనాక్షీ లేఖి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా సభను 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలాఉంటే.. రాజ్యసభలో ఈ రోజు ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమోదించారు. అనంతరం హరివంశ్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.
Also Read: