Budget 2022: యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌ ప్రతులు.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?

|

Feb 01, 2022 | 12:15 PM

Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23 మంగళవారం (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే పూర్తి బడ్జెట్..

Budget 2022: యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌ ప్రతులు.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?
Follow us on

Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23 మంగళవారం (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే పూర్తి బడ్జెట్ పత్రం సాధారణ ప్రజల కోసం ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ (Union Budget Mobile App)లో కూడా అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగలవారు ఈ బడ్జెట్ ప్రతులను మొబైల్‌ యాప్‌ (Mobile App) నుంచి డౌన్‌లోడ్‌ (Download ) చేసుకోవచ్చు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత వారి సిస్టమ్‌లలో బడ్జెట్ డాక్యుమెంట్‌ (Documents)లకు అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌ల కోసం అప్లికేషన్ అందుబాటులో ఉంది, ఇక్కడ పార్లమెంటులో సమర్పించబడిన అన్ని పత్రాలు పీఈఎఫ్ లో (PDF) ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

బడ్జెట్ 2022 డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, కీలక ఫీచర్లను ట్రాక్ చేయడానికి వినియోగదారులు లాగిన్ లేదా రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్‌ ప్రతులు హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో అందుబాటులో ఉన్నాయి. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో పాటు పొందుపరిచిన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులను డౌన్‌లోడ్ చేయడానికి, చూడడానికి, ప్రింట్ తీసుకునేందుకు, డాక్యుమెంట్‌లను జూమ్ ఇన్ లేదా అవుట్ చేయడానికి అనుమతిస్తుంది. కంటెంట్‌లు, అలాగే లింక్‌లు. మొబైల్ యాప్‌తో పాటు, అన్ని బడ్జెట్ పత్రాలు కూడా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే

Budget 2022: అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది.. వచ్చే 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్