Budget 2022: Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. క్రిప్టో వంటి డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని పన్ను పరిధిలోకి తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. డిజిటల్ ఆస్తి నుంచి పొందే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆమె స్పష్టం చేశారు. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల్లో పొరపాట్లు సవరించుకునేందుకు దరఖాస్తు చేసిన ఏడాది నుంచి 2 సంవత్సరాలలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సభల మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే కేంద్రం త్వరలో డిజిటల్ రూపీని తీసుకురాబోతోంది. క్రిప్టో కరెన్సీ తరహాలో దేశీయ క్రిప్టో కరెన్సీని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో అందుబాటులోకి తేబోతోంది.
ఇవి కూడా చదవండి: