ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఈ-పాస్‌పోర్ట్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ-పాస్‌పోర్ట్‌లలో చిప్‌లు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయని ఆమె తెలిపారు. ఈ-పాస్‌పోర్ట్‌లు మరింత భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయని అధికారులు చెప్పారు. దీని తయారీకి రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తామన్నారు.
పాస్‌పోర్ట్‌లు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయన్నారు. పాస్‌పోర్ట్ జాకెట్‌పై సెక్యూరిటీ సంబంధిత డేటా ఎన్‌కోడ్ చేయబడిన ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందన్నారు. బయోమెట్రిక్ డేటాపై ఆధారపడినందున మరింత భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్‌లను బుక్ రూపంలో ఉస్తున్నారు.
Read Also.. Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..