Budget 2021 Insurance Sector:బీమారంగానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్ డీ ఐ) 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్ధిక రంగ సేవల్లో కీలకమైన బీమా రంగ ప్రైవేటీ కరణ దిశగా మరో అడుగు ముందుకేశారు. బీమా సంస్థల్లో ఎఫ్ డీ ఐ పరిమితిని మరింత పెంచేందుకు బీమా చట్టం సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఈ రంగంలో నేరుగా 49 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేవారు.. ఇప్పుడు ఇది 74 శాతానికి పెరుగుతుంది. అలాగే ఈ ఏడాదే జీవిత బీమా ఐ పీ ఓ ను విడుదల చేస్తామని, మూలధన సహాయం కోసం బ్యాంకులకు 20 వేల కోట్లు కేటాయిస్తామని ఆమె అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకేపిటలైజేషన్ కు ఇన్ని వేల కోట్లు కేటాయించినట్టు ఆమె వివరించారు. నిజానికి ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచాలని దేశంలోని పాలన్ స్టార్టప్ లు కోరుతున్నాయి. ఈ మేరకు లోగడ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
Also Read: