Income Tax Relaxation FY 2021-22: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చింది. వయో వృద్థులపై నిర్మలా సీతారామన్ కాస్త దయ చూపించారు. ఐటీ రిటన్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పెన్షన్, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించారు. ఫించన్లు, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపులు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర తాజా నిర్ణయంతో ఫించన్‌దారులకు ఊరట లభించనుంది.
మరోవైపు, చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది ఆదాయపన్ను శ్లాబుల్లో ఏలాంటి మార్పులు చేర్పులు ఉండవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి… Budget in Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్