Budget 2021 : కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి 2021-22 బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఈ సందర్భంగా కేంద్రం బడ్జెట్ యాప్‌ను విడుదల చేశారు మంత్రి. ఇక విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్… కరోనా లాక్‌డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ‘‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ఆహార వసతులు కల్పించాం. పూర్తి స్వదేశీ పరిజ్జానంతో ఉత్పత్తి చేసి పరిశ్రమలకు ప్రోత్సాహకంా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశామ మంత్రి నిర్మలా పేర్కొన్నారు.
ఇక గతంలో ఎన్నడూలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్‌తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచామని తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు 80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించామని మంత్రి నిర్మలా తెలిపారు. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఆర్థిక సాయం అందించేందుకు, ముఖ్యంగా పెళ్లీడుకు వచ్చిన పిల్లల వివాహనికి ప్రోత్సాహకంగా ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ ప్రవేశపెట్టామన్న నిర్మలా ఇందు కోసం రూ.2.75లక్షల కోట్లు కేటాయించామన్నారు.