Budget 2021 : కాలుష్య నివారణకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు.. ఇకపై కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి

|

Feb 01, 2021 | 12:05 PM

ఈ సారి బడ్జెట్‌లో నూతన వాహన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు ఆర్థిక మంత్రి.

Budget 2021 : కాలుష్య నివారణకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు.. ఇకపై కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి
Follow us on

Budget 2021 : పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో సారి ప్రవేశపెట్లారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు మంత్రి నిర్మలా. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన వాహన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్పత్తి సంస్థలు ప్రత్యేక విధానాన్ని అవలంభించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు.

ఇకపై పాత వాహనాలను, కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రాకుండా అరికట్టేందుకు కేంద్ర పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇకపై భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Read Also.. Budget 2021: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

&