Atmanirbhar Bharat: అందరూ ఊహించినట్లుగానే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించారు. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఆరోగ్య రంగ బడ్జెట్ లక్ష కోట్లు దాటలేదు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆత్మనిర్బర్ ఆరోగ్య పథకం పేరుతో రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. వ్యాధుల నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.
సంవత్సరం కేటాయింపులు కోట్లలో…
2019 -20 రూ.86,259
2020- 21 రూ.94,452
2021- 22 రూ.2,23,846
Also Read:
బడ్జెట్ లైవ్ ఇక్కడ వీక్షించండి: https://tv9telugu.com/live-tv