Anurag Thakur: భారత్‌లో 80కిపైగా చైనా కంపెనీలు ఉన్నాయి: రాజ్యసభలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

|

Feb 09, 2021 | 7:07 PM

Anurag Thakur: భారత్‌లో 80కిపైగా చైనా కంపెనీలు చురుకుగా వాణిజ్యం సాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం రాజ్యసభకు తెలిపారు...

Anurag Thakur: భారత్‌లో 80కిపైగా చైనా కంపెనీలు ఉన్నాయి: రాజ్యసభలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
Follow us on

Anurag Thakur: భారత్‌లో 80కిపైగా చైనా కంపెనీలు చురుకుగా వాణిజ్యం సాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం 92 చైనా కంపెనీలు ఇండియాలో రిజిస్టర్‌ అయ్యాని, గల్వాన్‌లోయలో చైనా-భారత్‌ బలగాల మధ్య కొద్ది రోజుల కిందట జరిగిన ఘర్షణలో సుమారు 40 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో చైనా కంపెనీలపై ఆంక్షలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

కంపెనీల వాణిజ్యానికి సంబంధించి తగినన్ని నిబంధనలు అమలులో ఉన్నాయని, ఏ కంపెనీలైనా ఆ నిబంధనలకు లోబడి ఉండాలని మంత్రి సమధానం ఇచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మాట్లాడుతూ.. రక్షణ, అంతరిక్ష, ఆటమిక్‌ ఎనర్జీ వంటి కొన్ని రంగాలు మినహా ఎఫ్‌డీఐలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రిస్తుందన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఆర్‌బీఐ అనుమతిస్తుందని అన్నారు. గల్వాన్‌ ఘర్షణల అనంతరం టిక్‌టాక్‌ సహా59 చైనా మొబైల్స్‌ అప్లికేషన్లను మోదీ సర్కార్‌ నిషేధించిందన్నారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతోనే వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని సభలో తెలిపారు.

Also Read: ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు