వ్యయ భారం తగ్గించుకునే దిశగా బీఎస్ఎన్ఎల్.. ఏం చేస్తుందంటే..?

బీఎస్ఎన్ఎల్ తన వ్యయ భారాన్నీ తగ్గించుకునేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీంతో సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టడంతో.. ఉన్న ఉద్యోగుల్లో దాదాపు సగంమంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో సంస్థకు వేల కోట్ల జీతభత్యాల ఖర్చు తగ్గనుంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో […]

వ్యయ భారం తగ్గించుకునే దిశగా బీఎస్ఎన్ఎల్.. ఏం చేస్తుందంటే..?
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2019 | 5:01 AM

బీఎస్ఎన్ఎల్ తన వ్యయ భారాన్నీ తగ్గించుకునేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీంతో సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టడంతో.. ఉన్న ఉద్యోగుల్లో దాదాపు సగంమంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో సంస్థకు వేల కోట్ల జీతభత్యాల ఖర్చు తగ్గనుంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో దాదాపు రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల చెల్లింపుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. ఈ వీఆర్ఎస్ స్కీమ్ నవంబర్‌ 4 నుంచే ప్రారంభమైంది. డిసెంబర్‌ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ తెలిపారు. ఇప్పటికే ఈ వీఆర్‌ఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులందరికీ తెలిపామన్నారు. మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపుగా లక్ష మంది ఉద్యోగులు.. ఈ వీఆర్‌ఎస్‌ స్కీంకు అర్హులన్నారు. వీరిలో 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉందని పుర్వార్‌ తెలిపారు. వీరి వీఆర్‌ఎస్‌ వల్ల కార్పొరేషన్‌కు రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల భారం తగ్గనుందని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న 50 ఏళ్లు పైబడిన పర్మినెంట్ ఉద్యోగులు.. ఈ వీఆర్ఎస్ స్కీంకి అర్హులు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సర్వీసుకు గానూ.. ఏడాదికి 35 రోజుల లెక్క వేతనాన్ని, రిటైర్మెంట్‌ వయసుకు మిగిలి ఉన్న ఏళ్లకు గానూ 25 రోజుల వేతనాన్ని వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా కింద ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ కూడా ఉద్యోగులకు ఇదే వీఆర్ఎస్ స్కీం ప్రవేశపెట్టింది. దీనికి కూడా అందులో పనిచేసే ఉద్యోగులు.. డిసెంబర్‌ 3 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా, ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో