ప్రాణం తీసిన ఈత సరదా.. ఒకరు మృతి.. మరొకరికి సీరియస్

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఒకరి ప్రాణాలు తీయగా, మరోకరి పరిస్థితి విషమంగా మారింది.

ప్రాణం తీసిన ఈత సరదా.. ఒకరు మృతి.. మరొకరికి సీరియస్

Updated on: Jul 03, 2020 | 6:11 PM

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఒకరి ప్రాణాలు తీయగా, మరోకరి పరిస్థితి విషమంగా మారింది. కొత్తగూడ మండలంలోని కొర్ర‌కుంట తండాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువ‌కులు ఖాళీ సమయం దొరకడంతో కౌల్ నారాయ‌ణ‌కుంట‌ చెరువులో ఈత‌కు వెళ్లారు. ఆ చెరువు లోతు తెలియ‌ని నలుగురు యువకులు ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో మునిగిపోయారు. యువకుల అరుపులు విన్న స్థానిక రైతులు వారిలో ఇద్దరిని ఒడ్డుకు చేర్చి రక్షించారు. మరో ఇద్దరు నీట మునిగారు. అందులో లింగయ్య అనే యువ‌కుడిని చెరువు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజేందర్ అనే యువ‌కుడు చెరువులో మునిగి చనిపోయాడని స్థానికులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తండాలో విషాదం నెల‌కొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us