మరొకరి భర్తతో ఒకే రూంలో మహిళా పోలీస్ క్వారంటైన్

|

Jul 16, 2020 | 8:49 PM

అవివాహిత మహిళ.. అధికారులకు అద్దె మొగుడిని పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒకే రూంలో అధికారిక క్వారంటైన్ లోకి వెళ్లారు. తీరా, అసలు భార్య భర్త కోసం వెతుకుతుండడంతో బండారం బయటపడింది. మ‌హారాష్ర్టలో ఓ మహిళ పోలీసు రంకు భాగోతం వెలుగులోకి వచ్చింది.

మరొకరి భర్తతో ఒకే రూంలో మహిళా పోలీస్ క్వారంటైన్
Follow us on

అవివాహిత మహిళ.. అధికారులకు అద్దె మొగుడిని పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒకే రూంలో అధికారిక క్వారంటైన్ లోకి వెళ్లారు. తీరా, అసలు భార్య భర్త కోసం వెతుకుతుండడంతో బండారం బయటపడింది. మ‌హారాష్ర్టలో ఓ మహిళ పోలీసు రంకు భాగోతం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నాగ్‌పూర్‌లోని కొందరు పోలీసులు వైరస్ సోకింది. త‌న తోటి పోలీస్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అవివాహిత మ‌హిళా పోలీస్ కానిస్టేబుల్ ను అధికారులు క్వారంటైన్ కు త‌ర‌లించారు. ఆమెతో ప్రైమ‌రీ కాంటాక్ట్ అయినవారి గురించి ఆరా తీయగా, తన ప్రియుడిని భ‌ర్త‌గా పేర్కొంటూ అధికారుల‌కు వివ‌రాలు అందించింది. దీంతో అధికారులు ఇద్దరిని క‌లిపి పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లోని క్వారంటైన్ కు త‌ర‌లించారు. అంతా బాగానే సాగుతుండ‌గా క‌థ మ‌లుపు తిరిగింది.

ఇదిలావుంటే, తన భ‌ర్త మూడు రోజులైనా ఇంటికి రాక‌పోవడంతో నాగ్‌పూర్‌కు చెందిన ఓ వివాహిత వెతుక్కుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు అందించిన సమాచారంతో ఆమె భ‌ర్త వేరే మ‌హిళ‌తో క‌లిసి క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుసుకుంది. అతన్ని క‌లిసేందుకు పీటీసీకి వెళ్ల‌ిన మహిళను అక్క‌డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన భర్తపై బజాజ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచార‌ణ చేపట్టిన పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని మ‌రొక క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను తప్పుదారి పట్టించిన సదరు మహిళ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలకు అదేశించారు పోలీసులు కమిషనర్.